చిరంజీవి గొప్పతనం అర్థమవ్వాలంటే ఇది తెలియాలి

ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని మూడు దశాబ్ధాలపాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం తెలియాలంటే కొంత మంది హీరోల గురించి తెలుసుకోవాలి. చిరంజీవి జెనరేషన్ హీరోలను పక్కన పెడితే…ఆ తర్వాత చిరంజీవి స్థాయికి కాకపోయినా ఓ పెద్ద స్టార్ హీరోగా ఎదిగే అవకాశం చాలా మందికి వచ్చింది. కానీ వాళ్ళందరూ కూడా చిరంజీవిలా కెరీర్‌ని ప్లాన్ చేసుకోలేకపోయారు. ప్రవర్తనలో చిరంజీవి స్థాయి మెచ్యూరిటీని చూపించలేకపోయారు. తెరపైన కనిపించే అవకాశమే రాకుండా పోయిన వేలాది మంది టాలెంటెడ్ యాక్టర్స్ విషయం పక్కన పెడదాం. అవకాశాలతో పాటు సక్సెస్‌ని, స్టార్ ఢమ్‌ని తెచ్చుకున్న తర్వాత కూడా నిలబడలేకపోయిన, నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ళలేకపోయిన వాళ్ళ గురించి చెప్పుకుందాం.

తరుణ్, ఉదయ్ కిరణ్, రాజా, రోహిత్, తనీష్…….ఇంకా కొందరి పేర్లు చెప్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది కానీ చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఈ హీరోలందరూ కూడా సూపర్ సక్సెస్‌ని చూసిన వాళ్ళే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్, హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని లక్షల మంది యువకులు సినిమా హీరో అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే… పైన చెప్పుకున్న వాళ్ళతో పాటు ఇంకా కొంత మంది వారసత్వ హీరోలు, కొత్త హీరోలకు అలాంటి అద్బుత అవకాశం వచ్చింది. ప్రేక్షకులు కూడా ఆదరించారు. ప్రవర్తన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఎక్కడ తగ్గాలో నేర్చుకుని ఉంటే, అనవసరమైన ఇగోలకు పోయి ఇష్యూస్ తెచ్చుకోకుండా ఉండి ఉంటే …కరెక్ట్‌గా చెప్పాలంటే చిరంజీవిలా ఆచితూచి స్పందిస్తూ…అందరితో మంచిగా ఉంటూ….రోజు రోజుకూ నటన విషయంలోనూ, డ్యాన్సులు, ఫైట్స్ విషయంలోనూ, ఫిజిక్ విషయంలోనూ బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేసి ఉంటే వీళ్ళు కూడా స్టార్ హీరోస్ అయ్యేవారనడంలో సందేహమే లేదు. ఎందుకంటే వీళ్ళలో ఎవ్వరూ కూడా టాలెంట్ లేని వాళ్ళు లేరు. చిరంజీవి కంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిరంజీవిలా లౌక్యం ప్రదర్శించలేకపోయారు. ఆవేశపడ్డారు. అహాన్ని చూపించారు. శతృవులను కొని తెచ్చుకున్నారు. పూర్తిగా కెరీర్ పైనే కాన్సన్‌ట్రేట్ చేసే పరిస్థితులలో లేకుండా పోయారు.

చిరంజీవి జీవితం నుంచి ఒక్క విషయమైతే కచ్చితంగా నేర్చుకోవచ్చు. మనమందరం కూడా ఎక్కడ ఎమోషన్‌ని అక్కడే ప్రదర్శించేస్తూ ఉంటాం. ఉక్రోషం, ఆవేశం ఆపుకోలేం. ఎదుటివాడు ఏదో అన్నాడని వెంటనే వాడిని ఓ మాట అనకపోతే మనకు నిద్ర పట్టదు. ఆ విషయంలో చిరంజీవి అద్బుత విజయం సాధించాడు. అన్నీ మనసులోనే పెట్టుకున్నాడు. ఎక్కడా కూడా బయటపడలేదు. తన కసిని మొత్తం కూడా వర్క్ పైనే చూపించాడు. విజయం సాధించటం పైనే కాన్సన్‌ట్రేట్ చేశాడు. అందుకే ఈరోజు అందరూ కూడా తెలుగు సినీ తెరపై చిరంజీవి సాధించిన విజయాల గురించే మాట్లాడుతున్నారు. అదే చిరంజీవి కూడా ఎక్కడికక్కడ….ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టకుని ఉంటే…..అందరితో ఇష్యూస్ తెచ్చుకుని ఉంటే ఈ రోజు మీడియా కూడా ఆ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉండేది. అందుకే ఆవేశం, ఉక్రోషం, కసి, యాటిట్యూడ్…అన్నింటినీ కూడా వర్క్‌లో బెటర్‌మెంట్ తీసుకురావడం పైన చూపించండి. మీకు ఆ ఎమోషన్స్ వచ్చేలా చేసిన, మిమ్మల్ని అవమానించిన, మిమ్మల్ని ఇరిటేట్ చేసేలా చేసిన వాళ్ళే సిగ్గుపడేస్థాయి విజయాలు మీ సొంతమవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close