బండి సంజయ్‌కు బెయిల్.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం !

రాజకీయ ఎజెండాతో అధికార పార్టీ చెప్పినట్లుగా చేయడానికి ఏ మాత్రం ఆలోచించని పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. బండి సంజయ్ అరెస్ట్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ సరికాదని కింది కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టింది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్ ఐ ఆర్ ఎలా నమోదు చేశారని.. అంత వేగంగా ఎలా సాధ్యమయిందని పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. రాత్రి 10:50 అరెస్టు చేస్తే 11 గంటల 15 నిమిషాలకు ఎఫ్ ఐ ఆర్ చేయడం సరైనది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఎఫ్ఐఆర్లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తోపులాట లో పోలీసుల కుడిచేయి వేలికి గాయమైందని లాయర్ చెప్పుకొచ్చారు. అయితే కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసుల గాయాల పై మెడికల్ రిపోర్ట్ అందాల్సి అందలేదని ఉందని న్యాయమూర్తి గుర్తు చేశారు. గాయం అయిందో లేదో మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎలా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి.. అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించారు.

బండి సజంయ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. బండి సంజయ్ దీక్షపై పోలీసులు అంత తీవ్రంగా ఎందుకు స్పందించారో ఎవరికీ అర్థం కాలేదు. అత్యంత దారుణంగా పార్టీ కార్యాలయంలోకి చొరబడి మరీ దాడులకు దిగారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీసుల ుఈ విషయంలో ఇబ్బందిపడే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close