రూపాయి పెడితే.. నాలుగు రూపాయ‌లొచ్చాయ్‌!

ఈవారం విడుద‌ల అవుతున్న సినిమాల్లో అంద‌రి క‌ళ్ల‌నీ త‌న వైపు తిప్పుకొంది ‘ఓం భీమ్ భుష్‌’. శ్రీ‌విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. రేపే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చి పెట్టింది. రూపాయికి నాలుగు రూపాయ‌ల బిజినెస్ చేసుకొంది. అంటే మూడు రెట్లు లాభం అన్న‌మాట‌. ఓటీటీ రైట్స్‌ని అమేజాన్ మంచి రేటుకి సొంతం చేసుకొంద‌ని తెలుస్తోంది. శాటిలైట్ బేరం కూడా పూర్త‌య్యింది. శ్రీ‌విష్ణుకి ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ రూపంలో మంచి హిట్ ప‌డ‌డం, దానికి తోడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు ఆక‌ట్టుకోవ‌డంతో `ఓం భీమ్ భుష్‌` బిజినెస్ ప‌రంగా క్రేజ్‌ని సంపాదించింది. అదంతా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్‌కి బాగా ప‌నికొచ్చింది. వేస‌వి సెల‌వల్లో వ‌స్తున్న తొలి సినిమా కావ‌డం మ‌రింత అడ్వాంటేజ్ కాబోతోంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు అయిపోయిన‌ట్టే. టెన్త్ ప‌రీక్ష‌లు కూడా పూర్తి కావొస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా హోలీ పండుగ సెల‌వు కూడా ఈ సినిమాకు క‌లిసి రానుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే… బాక్సాఫీసు దగ్గ‌ర స‌రైన ప్ర‌త్యామ్నాయం లేదు. వీట‌న్నింటినీ… ‘ఓం భీమ్ భుష్‌’ బాగా క్యాష్ చేసుకొనే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close