అంతర్జాతీయ ఇంధన వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం జరుగుతున్న పోరాటం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్ర నాయకత్వంతో పాటు కీలక సైనిక అధికారులు దాదాపు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దూకుడు పెంచుతోంది.
ఇరాన్‌కు 48 గంటల డెడ్ లైన్ పెట్టిన ట్రంప్
హర్మూజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తెరవడానికి ఇరాన్ కు ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత ఉపేక్షించిలేదని ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని.. మొదటగా అతిపెద్ద పవర్ ప్లాంట్ పై బాంబులేస్తామని హెచ్చరించారు. ఈ ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ ఇంకా ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ఇరాన్ పై దాడులు తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ తన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగిస్తూ, సముద్ర మార్గాలను దిగ్బంధించడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికాపై మిత్రదేశాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగేలా చేసింది.
ఇరాన్ తగ్గేందుకు సిద్ధంగా లేదు !
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న భారీ నష్టాన్ని చూసి విస్తుపోతున్న దేశాలు, ఇప్పుడు అమెరికా రక్షణ కన్నా ఇరాన్‌తో చర్చలకే మొగ్గు చూపుతున్నాయి. అమెరికా నేతృత్వంలోని కూటమి వైపు చూడటం కంటే, నేరుగా ఇరాన్ నాయకత్వానికి లేఖలు రాయడం, దౌత్యపరమైన రాయబారాలు పంపడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు భావిస్తున్నాయి. యుద్ధం ద్వారా ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న అంచనాలు తప్పాయని, ఆ దేశం చూపిస్తున్న ప్రతిఘటన అంతర్జాతీయ సమాజాన్ని పునరాలోచనలో పడేసిందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
ఫలితాలు ఇవ్వని ట్రంప్ చర్యలు
ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ సంక్షోభంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడమే కాకుండా, అమెరికాను ఒక రకమైన ఆత్మరక్షణలో పడేసింది. ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో పాటు, భౌగోళికంగా తమకున్న అనుకూలతను ఆయుధంగా మార్చుకుని ప్రపంచంపై తనపై సానుభూతి చూపించేలా చేసుగోగలిగింది. హార్ముజ్ జలసంధిని విడిచిపెట్టాలని ప్రపంచ దేశాలు ఇరాన్‌ను బతిమాలుకునే పరిస్థితి రావడం, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా పరిగణించవచ్చు.
