ఇంజనీరింగ్ కోర్సులు డ్రాపవుట్ ! నిట్, ఐఐటిల్లో కూడా ఖాళీలు

ఎంసెట్ లో చాలా మంచి ర్యాంకు, ఇంటర్ ఎంపిసి లో 94 శాతం మార్కుల అమ్మాయి ఉండవల్లి మైత్రేయి ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం, సైకాలజీ గ్రూపులతో బిఎ చదువుతోంది. ఈ మూడింటిలో ఎక్కడైనా కెరీర్ వుంటుందన్నది మైత్రేయి ఆలోచన. ఈ చదువు ఆ అమ్మాయిలో రైటింగ్ స్కిల్స్ నికూడా బయటకు తెచ్చింది.

టీచర్ ని అవుతా అంటోంది ఇంటర్ సెకెండియర్ చదువుతున్న కాశిన మౌనిక…ఈ అమ్మాయికూడా 94 శాతం మార్కుల ప్రతిభావంతురాలే. తరవాత కావాలనుకున్నా కుదరదు ఎంసెట్ రాయి అని ఒప్పించడం పేరెంట్స్ కి చాలాకష్టమైంది.

కెరియర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా వున్నాయని పేరెంట్స్ కంటే ముందు గుర్తించిన పిల్లలు వీళ్ళు. అనేక మంది సగటు విద్యార్ధులు కూడా ఇంజనీరింగ్ కోర్సు మధ్యలోనే చదువుమీద ఆసక్తిని కోల్పోతున్నారు. పుస్తకాల్లో చదువుకున్న విద్యకంటే ఫంక్షనల్ లిటరెసీ ముఖ్యమని గ్రహించిన అనేకమంది ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్స్ ఏవేవో పనుల్లో కుదురుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి వుంది.

రాష్ట్రవిభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కి తాడేపల్లిగూడెంలో ప్రారంభమైన ఎన్ఐటి (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో 60 సీట్లు మిగిలిపోయాయి.అక్కడ 8 బ్రాంచ్ లలో 480 సీట్లు వున్నాయి. వరంగల్‌ ఎస్‌ఐటీలో కూడా ఏపీ కోసం మంజూరైన 60 సూపర్‌న్యూమరీ సీట్లతో కలిసి 800 సీట్లున్నాయి. వాటిలోనూ 35 సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్ చదువుల్లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గుర్తింపు వున్న ఎన్ఐటి, ఐఐటి సంస్ధల్లో చదువు మధ్యలోనే మానేస్తున్న డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగిపోతోంది.

మూడేళ్లలో ఐఐటిల నుంచి 2 వేల మంది, ఎస్‌ఐటిల నుంచి మరో 2,500 మంది విద్యార్థులు చదువు మధ్యలో ఆపేశారు. ఇంజినీరింగ్‌లో కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పడిపోతోంది. రాష్ట్రంలో యూనివర్సిటీ కళాశాలలతో పాటు 361 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. వాటిలో 1,13,745 సీట్లు న్నాయి.

పడిపోయిన విద్యా ప్రమాణాలు, పెరిగిన ఫీజులు, మానసిక ఒత్తిడి, చదివినా ఉద్యోగాలు రాని దుస్థితి తది తర కారణాల వల్ల విద్యార్థులు మధ్యలోనే తిరుగు బాట పడుతున్నారు.విద్యార్థుల కంటే సీట్లు అధికం కావడం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం ఫలితంగా ఇంజినీరింగ్‌ విద్య మసకబారుతోంది.

ప్రభుత్వాల విధానాలు, యూనివర్సిటీల నిర్ణయాలు బిఎ ఎమ్మస్సీ ఫిజిక్స్ మాధ్స్ వగైరా వగైరా ప్యూర్ సైన్సస్ ను విస్మరించి ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి అప్లికేషనల్ సైన్సెన్ ప్రోత్సహించాయి. బోధనా వాతావరణం, నేర్పించే విధానాలు విద్యార్ధులో నిరాసక్తతను పెంచేస్తున్నాయి. ఇందువల్ల వారు క్వాలిఫై అవుతున్నారేతప్ప వారిలో నాలెడ్జ్ వుండటంలేదు. నాలెడ్జ్ లేని ఇంజనీర్లు, టెక్నోక్రాట్లు తయారయ్యే కంటే ఆసీట్లు మిగిలిపోవడమే కరెక్ట్ అని రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ మైఖేల్ వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ కాలేజీలు నాలెడ్జ్ సెంటర్లు గా అభివృద్ది అయితే తప్ప ఇంజనీరింగ్ చదివినా చదవకపోయినా తేడా లేదన్నారు.

దేశంలో ప్రవేశిస్తున్న విదేశీ యూనివర్సిటీల టీచింగ్ మెధడాలజీ చదువుల పట్ల ఆసక్తి పెంచుతుందేమో చూడాలి. వచ్చే పది పదిహేనేళ్ళలో ఏఏ రంగాల్లో అవకాశాలున్నాయో స్పష్టమైతే ఆమేరకు కోర్సులు రావచ్చు అని ఒక గవర్నమెంటు కాలేజి ప్రిన్సిపాల్ అన్నారు.

ఇంజనీరింగ్ చదువుల మీద నిరాసక్తత పెరుగుతున్న సమయంలోనే ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలలో చదువుకోడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్న విద్యార్ధులలో మధ్యతరగతి ఆదాయవర్గాల వారి సంఖ్య పెరుగుతూండటం విశేషం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close