విశాఖకు ఇన్ఫోసిస్ – గుడివాడకు తెలియకుండానే !

విశాఖ పట్నం నుంచి గత మూడేళ్లుగా చాలా ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయి. రావాల్సిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మాత్రమే కాదు వచ్చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీ లాంటి కంపెనీలు కూడా వెళ్లిపోయాయి. ఏపీ ప్రభుత్వ విధానాలే దీనికి కారణం. అయితే ఇప్పుడు ఇన్ఫోసిస్ తమ క్యాంపస్‌ను వైజాగ్‌లో ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. తమ దగ్గర పని చేస్తున్న ఉద్యోగులు.. కొత్తగా నియమించుకుటున్న ఉద్యోగుల్లో అత్యధిక మంది టైర్ -2 సిటీల నుంచి వస్తున్నారని.. అలాంటి సిటీల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని కంపెనీ చెబుతోంది. మొత్తం నాలుగు టైర్ – 2 సిటీల్ని ఎంపిక చేసుకోగా అందులో ఒకటి వైజాగ్.

వైజాగ్‌లో వెయ్యి మంది ఉద్యోగుల సామర్థ్యంతో తొలి క్యాంపస్ పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. పెట్టుబడులు.. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు కూడా తెలియదు. ఎందుకంటే ఇన్ఫోసిస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా ఆఫీసు.. ఇతర ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటోంది. రాజకీయం అనే మాటే వినిపించకూడదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మేమే వెళ్లాము.. మేమే తెచ్చాము అని ఇతరులు చెప్పుకునే చాన్స్ ఇవ్వకుండా తామే వచ్చాము అన్నట్లుగా ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటోంది.

నిజానికి ఐటీ కంపెనీలు వస్తే ఎంతో కొంత భూమి ఇచ్చి.. తామే తెచ్చామని రాజకీయ పార్టీలు చెప్పుకుంటాయి. ఇక్కడ ఇన్ఫోసిస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది ఆశించడం లేదని తెలుస్తోంది. కారణం ఏదైనా … విశాఖకు ఇన్ఫోసిస్ వస్తోంది. ఎంత త్వరగా క్యాంపస్ పెడితే.. ఇతర కంపెనీలు కూడా అంతే త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని సంప్రదించంకుండా వచ్చేస్తారా అని ఈగోకు పోయి.. అడ్డంకులు సృష్టించకపోతే.. విశాఖకు మంచి అవకాశమే. మరి ప్రభుత్వానికి అంత ఔదార్యం ఉందా అనేదే డౌట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close