అమాయ‌కుడికి పాకిస్థాన్ ఉరిశిక్ష‌

ఒక‌ప‌క్క ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ఇద్ద‌రు పాకిస్థాన్ మెరైన క‌మాండ‌ర్ల‌ను ర‌క్షిస్తే అందుకు ప్ర‌తిగా ఆ ముష్క‌ర దేశం మ‌రోసారి విషం క‌క్కింది. త‌మ దేశంలో భార‌త్ తీవ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోందంటూ విష‌ప్ర‌చారాన్ని ప్రారంభించింది. రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్‌కు చెందిన అధికారి కుల‌భూష‌ణ్ యాద‌వ్‌నుంచి బ‌ల‌వంతంగా అంగీకార వాంగ్మూలాన్ని తీసుకుని, దాన్ని రికార్డు చేసింది. బ‌లూచిస్థాన్‌, కరాచీల‌లో తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌కు ఊత‌మిస్తున్నాడ‌నే అభియోగాల‌ను మోపి, ఉరిశిక్ష‌ను విధించింది. బ‌లూచిస్థాన్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లూ, అనిశ్చితి వెనుక భార‌త్ ఉంద‌ని ప్ర‌పంచాన్ని న‌మ్మించ‌డానికి పాకిస్థాన్ ఈ కుట్ర పన్నింది. మార్చి 3, 2016న ఇరాన్‌లో కుల‌భూష‌ణ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఇంత‌వ‌ర‌కూ అత‌డు పాకిస్థాన్‌లో నివ‌సించాడ‌న‌డానికి రుజువులు చూపించ‌లేదు. అత‌నికి ఉరిశిక్ష విధించిన విష‌యాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఖ‌మ‌ర్ జావేద్ బ‌జ్వా నిర్ధారించారు. ఎప్పుడు ఉరి తీసేదీ వెల్ల‌డి కాలేదు. భార‌త్‌ను తీవ్రంగా రెచ్చ‌గొట్టే చ‌ర్య‌గా దీన్ని భావించాల్సి ఉంటుంది. భార‌త ఏజెంట్లు పాక్‌లో అనిశ్చితికి కార‌ణ‌మ‌వుతున్నార‌ని నిరూపించేందుకు ముష్క‌ర మూక ఈ చ‌ర్య‌కు ఒడిగ‌ట్టింది. ఫీల్డ్ మార్ష‌ల్ జ‌న‌ర‌ల్ కోర్టు కుల‌భూష‌ణ్‌ను విచారించింది. త‌న నేరాల‌ను ఆయ‌న అంగీక‌రించాడ‌నీ, అత‌డికి న్యాయ స‌హాయాన్ని కూడా అందించామ‌నీ కోర్టు పేర్కొంది. ఉరిశిక్ష విధించిన వార్త తెలిసిన వెంట‌నే భార‌త్ తీవ్రంగా స్పందించింది. భార‌త్‌లో పాక్ రాయ‌బారి బాసిత్‌ను త‌న ముందు హాజ‌రుకావాల‌ని విదేశాంగ శాఖ ఆదేశించింది.
అమాయకుల్ని పొట్ట‌న పెట్టుకోవ‌డం, తీవ్ర‌వాదుల్ని స‌రిహ‌ద్దుల్ని దాటించ‌డ‌నాకి ఎంత‌కైనా తెగించ‌డం పాకిస్థాన్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. కుట్ర‌లు భ‌గ్న‌మై అంత‌ర్జాతీయ స‌మాజం ముందు ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతుండ‌డంతో పాకిస్థాన్‌కు దిక్కుతోచ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అమెరికా కొత్త అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర‌వాదంపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం, ఆ మేర‌కు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేయ‌డం మింగుడు ప‌డ‌లేదు. రాజ‌కీయంగా స‌మాధాం చెప్పుకోవ‌డం రాక‌, భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌నే కుటిల యోచ‌న‌తో అమాయ‌కుడైన కుల‌భూష‌ణ్‌ను హింసించి, భార‌త్‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యాల‌ను సృష్టించింది. కుల‌భూష‌ణ్ భార‌త గూఢ‌చారి అనే అంశంపై ఆధారాల‌ను మాత్రం పాక్ చూపించ‌డం లేదు. ఇదొక్క‌టీ చాలు పాకిస్తాన్‌ది కుటిల య‌త్నమ‌ని చెప్ప‌డానికి. విశ్వ‌స‌నీయ‌మైన ఒక్క రుజువు కూడా చూప‌కుండా కుల‌భూష‌ణ్‌కు ఉరి విధించ‌డాన్ని భార‌త్ త‌ప్పు ప‌ట్టింది. కుల‌భూష‌ణ్‌పై సాగిన విచార‌ణంతా ఫార్స‌ని పేర్కొంది. పాకిస్థాన్ ఆర్మీ తీవ్ర‌వాదానికి ఓ ఫ్రంట్ ఆఫీస్ లాంటిద‌ని తెలిపింది. హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం లాంటి తీవ్ర‌వాదుల‌ను పాకిస్థాన్‌లో స్వేచ్ఛ‌గా తిరుగుతుంటార‌ని అధిక్షేపించింది. అమాయ‌కుణ్ణి ఉరి తీసేందుకు పాకిస్థాన్ సిద్ధ‌మ‌వుతోందంది. కుల‌భూష‌ణ్ అంశంలో భార‌త్ 13సార్లు విన‌తులు పంపింద‌నీ, ఆ దేశం నుంచి ఎటువంటి స‌మాధానం లేద‌ని చెప్పింది.
Subrahmanyam vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

‘ఆర్య‌’ @ 20 ఏళ్లు: ప్రేమ‌క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌!

'ఐ ల‌వ్ యూ.. యూ ల‌వ్ మీ..' అని బ‌తిమాలుకొనేది ఒక త‌ర‌హా ప్రేమ క‌థ‌. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా - నువ్వు కూడా న‌న్ను ప్రేమించాల్సిందే' అని బ‌ల‌వంతం చేసేది మ‌రో త‌ర‌హా...

బేలగా జగన్ – అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేస్తున్నారు !

నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఎక్కడ.. ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ ఎక్కడ ?. మొదటిది ఏడాదిన్నర కిందట.. రెండోది పోలింగ్ కు వారం...

పోలింగ్ రోజున రాపిడో ఉచిత సేవలు

లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం పెంచేందుకు ప్రముఖ ప్రయాణ యాప్ రాపిడో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాపిడో ఉచిత సేవలను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. సోమవారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close