హీరో అంటే ఏంటో తెలిసింది – రానా దగ్గుబాటి

పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం గత వారం విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఈ వారంలో కూడా రికార్డ్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం లో డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రతో మెప్పించిన రానా బుధవారం సినిమా గురించి ఆయన పాత్రకు వస్తున్న స్పందన గురించి మీడియాతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

భీమ్లానాయక్‌ విడుదల రోజు నేను ముంబైలో వేరే షూటింగ్‌లో ఉన్నా. షూట్‌ కంప్లీట్‌ అయ్యాక అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్‌తో సినిమా చూశా. అప్పటికే సోషల్‌ మీడియాలో సినిమా సూపర్‌హిట్‌ అని హడావిడి జరుగుతోంది. మిత్రులు, సినిమా పరిశ్రమ నుంచి ప్రశంసలు, అభినందనలతో అప్పటికే చాలా మెసేజ్‌లు వచ్చాయి. చాలా ఆనందంగా అనిపించింది.

ఇద్దరూ ఇద్దరే…
కల్యాణ్‌గారి లాంటి పెద్ద స్టార్‌ వచ్చి ఇలాంటి జానర్‌ సినిమా ట్రై చేస్తున్నారంటే కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించింది. త్రివిక్రమ్‌గారు చాలా ఎగ్జైటింగ్‌ పర్సన్‌. ఏం మాట్లాడిన చాలా విలువైన మాటలాగా ఉంటుంది. నాలెడ్జ్‌ ఉన్న వ్యకి, భాష సంస్కృతి మీద మంచి పట్టు వుంది. మామూలుగా ప్రతి సినిమాతోనూ నేను చాలా నేర్చుకుంటాను. ఈ సినిమాతో త్రివిక్రమ్‌, పవన్‌కల్యాణ్‌ వల్ల చాలా నేర్చుకున్నా. త్రివిక్రమ్‌తో పనిచేయడం చాలా హ్యాపీ. కేరళ కథలకు, అక్కడి మనుషుల తీరు, సంస్కృతి మనతో పోల్చితే డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరు. అలాంటి నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్‌ అయ్యేలా మార్పులు చేర్పులు చేశారు. ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలో రాబర్డ్‌డౌనీ పాత్ర ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ నాకు. అందులో వాడు నచ్చని పనులు చేస్తాడు కానీ అవి మనకు నచ్చుతాయి. ఆ పాత్రకు డ్యాని పాత్రకు సిమిలర్‌గా అనిపించింది. ఈ సినిమా అనుకోగానే డ్యాని పాత్రకు ఎవర్నీ అనుకోకపోతే నేనే చేస్తానని అడిగా.

ఆయనతో బాగా కనెక్ట్‌ అయ్యా…
నా ఎక్స్‌పోజ్‌ సినిమానే. ప్రతి పాత్ర డిఫరెంట్‌గా ఉండాలనుకుంటా. డిఫరెంట్‌ ఆర్టిస్ట్‌లతో, కొత్త కథలు చేయాలనుకుంటా. అలాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. కలిసింది కూడా తక్కువే. ఈ సినిమా అనుకున్నాక ఆయన నాకు బాగా కనెక్ట్‌ అయిపోయారు. చాలా నిజాయతీ ఉన్న వ్యక్తి.

నేను విభిన్న కథలు ఎంచుకుంటాననే టాక్‌ ఉంది. చాలామంది రకరకాల రీజన్‌లతో యాక్టర్లు అవుతారు. నేను యాక్టర్‌ అయింది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని. అలా ఉండడం కోసం నటనలో చాలా మెళకువలు తెలుసుకున్నా.

అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్‌ అవ్వలేను. మాస్‌ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో పవన్‌కల్యాణ్‌ని చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కల్ట్‌ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది.

నా జోన్‌ సినిమా ఇది..
సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటరకి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది… అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారితో వెళ్తున్నా. ఈ కథ విన్న తర్వాత నా జోన్‌ సినిమా అనిపించింది. అయితే సినిమా చేసిన తర్వాత ఇంతకుమించి ముందుకు వెళ్లాలి అనిపించింది. నేను ఎప్పుడు సెలెక్టివ్‌గా ఉంటాను..సాహసాలు కూడా చేస్తాను. అయితే ‘భీమ్లానాయక్‌’ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది.

త్రివిక్రమ్‌ వెన్నెముక…
ఒక సినిమాను రీమేక్‌ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్‌ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉండాయో బాబాయ్‌ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్‌ చాలా కష్టపడ్డారు ఒరిజినల్‌ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు. ఆ విషయంలో ఈ సినిమాకు త్రివిక్రమ్‌ వెన్నెముక అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఒరిజినల్‌ను మరచిపోయేలా రాశారు. దానికి తగ్గట్టే సాగర్‌ తెరకెక్కించారు.

నో డామినేషన్‌…
ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్‌ లో ఉండేవారు.

టీమ్‌ అందరి కృషితోనే…
సాగర్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పర్సన్‌. అతన్ని చూస్తే జెలసీ ఉంటుంది. ఒకేసారి పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో పని చేసే అవకాశం అతనికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే చెప్పలేం. దర్శకుడిగా సాగర్‌ చేయాల్సింది చేశాడు., మాటలు, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా త్రివిక్రమ్‌ చేసేది చేశారు. టీమ్‌ అందరి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం. ఈ సినిమా విడుదల లేట్‌ అయింది కానీ.. మొదటి నుంచి అన్నీబాగా కుదిరాయి. పాటలు విడుదల నుంచి సినిమాకు ఎలాంటి బజ్‌ వచ్చిందో తెలిసింది.

ఆ ప్రయత్నం చేస్తా.
నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను. సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది. ‘ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు ఇండస్ర్టీ మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌ చెబుతుందని ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌ టైమ్‌ ఓ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close