కొత్త మంత్రుల బాధ్య‌త‌ చిన‌బాబుదే..!

ఈ మ‌ధ్య‌నే ఏపీ క్యాబినెట్ లో కొత్త మంత్రులు కొలువుదీరారు. ఎన్నో విమ‌ర్శ‌లకోర్చి, ఎంతో మేథోమ‌ధ‌నం చేసి, వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకుని, వ‌ర్గ‌పోరును జ‌యించి.. ఇలా ఎన్నో త్యాగాలు (వాళ్ల పాయింటాఫ్ వ్యూలో) చేసిన కొంద‌రు ఫిరాయింపుదారులు మంత్రుల‌య్యారు! ‘హ‌మ్మ‌య్య‌.. ఏదైతేనే మంత్రి కుర్చీలోకి వ‌చ్చేశాం. ఇక మ‌న‌దే రాజ్యం’ అనుకునేంత సీన్ జంప్ జిలానీల‌కు లేద‌ని ఇప్పుడిప్పుడే అర్థ‌మౌతోంది! టీడీపీలో ఉన్న వైకాపా మంత్రుల‌కు తాజాగా త‌త్వం బోధ‌ప‌డుతోంద‌ట‌! మంత్రి ప‌ద‌వి వారికి కేవ‌లం అలంకారం మాత్ర‌మే. ప‌నుల‌న్నీ పెద్ద‌మ‌న‌సుతో చిన‌బాబు చూసుకుంటున్నార‌ని స‌మాచారం.

ఆఫీస్ లో సిబ్బందిని మంత్రులే నియ‌మించుకుంటారు క‌దా! అంటే, పీయేలూ పి.ఎస్‌.లూ పీఆర్వోలూ ఇలాంటి పోస్టుల్లో త‌మ‌కు కావాల్సినవారినే ఏ మంత్రైనా పెట్టుకుంటారు. ఫిరాయింపు మంత్రులూ అలానే అనుకున్నార‌ట‌. క్యాబిన్లో కూర్చోగానే సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని భావించారు. కానీ, ఈలోగా ఒక వ్య‌క్తి వ‌చ్చి.. ‘నేనే మీ పీయే’ అనీ, మ‌రొక‌రు ‘నేనే మీ పీఆర్వో’ అంటూ ప‌రిచ‌యాలు చేసుకున్నార‌ట‌! ఈ ప‌రిస్థితి బొబ్బిలి రాజావారికి ఎదురైంద‌ని తెలుస్తోంది. జంప్ జిలానీల్లో సుజ‌య్ కృష్ణ‌రంగా కూడా ఉన్నారు. జంపింగ్ పుణ్య‌మా అని బొబ్బిలి రాజావారికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఇద్ద‌రు సిబ్బంది ఉన్నారు. వారినే పీయేలుగా, పి.ఎస్‌.లుగా నియ‌మించుకోవాల‌ని అనుకున్నారు. కానీ, ఈలోగా ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చి ‘మేమే మీ సిబ్బంది’ అంటూ ప‌రిచ‌యం చేసుకున్నార‌ట‌. దీంతో బొబ్బిలి రాజు షాక్ అయ్యారు. అంతేకాదు.. తాము లోకేష్ బాబు పంపిస్తే వ‌చ్చామ‌ని, ఆయ‌నే త‌మ‌ని నియ‌మించార‌ని చెప్ప‌డం ఇంకో షాక్‌!

కాస్త అటుఇటుగా ఇత‌ర జంప్ జిలానీ మంత్రుల‌కూ ఇలాంటి అనుభ‌వాలే ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఎదురౌతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంటే, త‌న‌తోపాటు మంత్రులుగా ప్ర‌మాణం చేసిన‌వారి బాధ్య‌త‌ల్ని కూడా అప్ర‌క‌టితంగా నారా లోకేష్ చూసుకుంటున్న‌ట్టే క‌దా! ఆ మాట‌కొస్తే… చంద్ర‌బాబు క్యాబినెట్ లో ఉన్న ఇత‌ర మంత్రుల పేషీల్లో కూడా చిన‌బాబు చెప్పిందే జ‌రుగుతోంద‌ని ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న ఆరోప‌ణ‌. ఆయ‌న మంత్రికాక ముందే బదిలీలు, నియామ‌కాలు చూసుకునేవార‌ని అంటుండేవారు. అలాంట‌ప్పుడు ఇప్పుడీ ఫిరాయింపు మంత్రుల విష‌యంలో అంతకంటే భిన్నంగా జ‌రుగుతుందా అంటూ కొంత‌మంది చెవులు కొరుక్కుంటున్నారు. కాకపోతే, జంప్ జిలానీల‌కు ఈ అనుభ‌వం కాస్త కొత్త‌… అంతే!

మొత్తానికి, ఫిరాయింపు మంత్రుల‌కు తత్వం బోధ‌ప‌డింది. ఇక‌పై వారు ఎలా ఉండాలో.. ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా నిర్ణ‌యాలు తీసుకోవాలో అన్నీ స్పూన్ ఫీడింగ్ అన్న‌మాట‌! మంత్రులం క‌దా.. స్వ‌తంత్రంగా ఆలోచిస్తాం అంటే కుద‌ర‌దన్న‌మాట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close