బీజేపీకి దూరం – పవన్ సంకేతాలు !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లగా బీజేపీకి దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి పని చేసే ప్రశ్నే లేదని.. కేంద్రంతో మాత్రం సన్నిహితంగా ఉంటామని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మకూరులో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధగా లేరు. పోటీకి దూరమని ప్రకటించారు కానీ పోటీ చేస్తామంటున్న బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మరో వైపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నడ్డా ను కలిసే చాన్స్ కూడా లేదని ఆయన ప్రకటించారు.

ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ ను దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు కలిసే నిర్వహించాలని అనుకుంటున్నప్పుడు జనసేనను పిలవాలి.. కానీ పిలవడం లేదు. గోదావరి గర్జన పేరుతో నిర్వహిస్తున్న సభకు కూడా పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. కనీస సమాచారం కూడా లేదు. నడ్డా ఏపీకి వస్తూ.. మేజర్ మిత్రపక్షమైన జనసేనకు సమాచారం ఇవ్వకపోవడంతో జనసేన అగ్రనేతలు కూడా నొచ్చుకున్నారు. తనకేమీ తెలియదని.. కలిసే అవకాశం కూడా లేదని.. పవన్ తెగేసి చెప్పారు.

పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కొంత మంది బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే నడ్డా టూర్‌కు అసలు పవన్ ను ఆహ్వానించకుండా ఆయనను సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌ను డీ గ్రేడ్ చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను అసలు పట్టించుకోనని పవన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా వైసీపీ కోవర్టులేనని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.

రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ తీరుపై పవన్ కల్యాణ్ అన్ని విశ్లేషించుకున్న తర్వాతనే .. దూరంగా ఉండటం మంచిదన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కేంద్ర అవసరాలో.. లేకపోతే.. మరో రకమైన రాజకీయమో కానీ.. వైసీపీని వారు ప్రోత్సహిస్తున్నారని.. తాను మధ్యలో అమాయకంగా బలైపోతున్నానన్న అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన బీజేపీకి దూరమైనట్లుగానే భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close