అగ్రవర్ణాల రిజర్వేషన్ ఉద్యమాల ఫలితం..! కాపు రిజర్వేషన్లకూ పరిష్కారమేనా..?

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల్లో … ఎంతో మంది పేదలు ఉన్నారు. కులం ప్రకారం రిజర్వేషన్లు ఉండటం వల్ల… దశాబ్దాలుగా అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే… వివిధ రాష్ట్రాల్లో… అగ్రవర్ణాలు .. రిజర్వేషన్లు కోసం.. ఓ స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. గుజరాత్ లో అత్యంత ధనవంతులుగా పేరు పడిన పటేళ్లు కూడా.. ఉద్యమించిన వ్యవహారాలు హైలెట్ అయ్యాయి. అలాగే జాట్లు, ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గాలు కూడా… తమకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. దాదాపుగా పదమూడు రాష్ట్రాల్లో అగ్రకులాలుగా పేరు పడిన సామాజికవర్గాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కాపులకు అదనంగా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని… డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. అవన్నీ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు… రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో.. వాటన్నింటికీ పరిష్కారం లభించినట్లవుతందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం… రిజర్వేషన్ కోసం చాలా కాలంగా పోరాడుతోంది. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి కానీ.. ఎవరూ చేయలేకపోయాు. వైఎస్ హయాంలో మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ.. అప్పట్లో కేంద్ర , రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అమలు చేయలేకపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత … రిజర్వేషన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం.. బీసీ కమిషన్ వేసి … నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం మాత్రం.. పెండింగ్ లో పెట్టింది. ఏపీలో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పెడితే.. ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ఇప్పుడు ఈబీసీ బిల్లు ఆమోదం పొందితే ప్రత్యేకంగా కాపులకే కాకుండా.. ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకూ కలిసి రిజర్వేషన్లు అందుతాయి.

కానీ కేంద్రం క్రెడిట్ తాము తీసుకోవడం కోసమే… దేశవ్యాప్తంగా ఈబీసీ రిజర్వేషన్లను తెరపైకి తెచ్చింది. అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన.. భారతీయ జనతా పార్టీకి.. ఈబీసీ బిల్లు ఓ రకంగా.., ఆక్సిజన్ లాంటిదే. అయితే అగ్రవర్ణాల మద్దతు పొందిన పార్టీలు ఇటీవలి కాలంలో.. ఎక్కువగా బలపడుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో.. వీటన్నింటిని దెబ్బకొట్టి.. తాము బలపడాలనే ఎత్తుగడ బీజేపీ వేసింది.రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణాలకు.. ఈ నిర్ణయం ఓ వరమే. కానీ దీన్ని చట్టంగా తీసుకొచ్చి అమలు చేస్తేనే.. బీజేపీని నమ్ముతారు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close