గుడివాడ కేసినో కేసుపైనా ఐటీ, ఈడీ దృష్టి !

కేంద్ర దర్యాప్తు సంస్థలు మెల్లగా ఏపీలోకీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడో ఏడాది కిందట గుడివాడ కేసినో కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేస్తే ఇప్పుడే గుర్తొచ్చినట్లుగా కేసు బయటకు తీశారు ఇన్‌కంట్యాక్స్ అధికారులు. మరిన్ని వివరాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన వర్ల రామయ్య ఐటీ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వనున్నారు.

జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నాలుగు రోజుల పాటు కేసినో నిర్వహించారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో తో పాటు పేకాట లాంటి జూదాలతో పాటు చీర్ గర్ల్స్ తో అసభ్య నృత్యాలు నిర్వహించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ నియమించారు. ఆ కమిటీ అనేక ఆధారాలను సేకరించింది.

క్యాసినో ద్వారా రూ. 250 నుంచి 500 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. మొత్తం 13 మంది చీర్ గర్ల్స్ ఇండిగో విమానంలో ప్రయాణం చేశారని వెల్లడించారు.గన్నవరం – బెంగళూరు. బెంగళూరు – గోవా, గోవా – విజయవాడ ప్రయాణీకుల వివరాలను మీడియా ముందు ఉంచారు. వీటిని దర్యాప్తు సంస్థలకు కూడా ఇచ్చారు. క్యాసినో పాల్గొనే వారి నుండి రూ.50వేల వరకూ వసూలు చేశారనీ, ఆ ప్యాకేజీలో భాగంగా లాడ్జి వసతి, ట్రాన్స్ పోర్టు, ఎంట్రీ ఫీజు అన్ని ఉచితమని వర్ల రామయ్య సాక్ష్యాలు చూపించారు. వీటిని ఢిల్లీకి వెళ్లి ఐటీ, ఈడీ, రెవిన్యూ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ఫిర్యాదు చేశారు.

గుడివాడ కేసినో అంశం తీవ్ర దుమారం రేగడంతో గుడివాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు . అప్పటి ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రత్యేక విచారణ అధికారిగా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును నియమించారు. .కానీ ఆ తర్వాత విచారణ ముందుకు సాగలేదు. ఇన్ని రోజులకు టీడీపీ నేతల ఫిర్యాదుపై ఐటీ స్పందించడం ఆసక్తికరంగా మారింది. గుడివాడలో కేసినో నిర్వహించింది.. కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్. దీంతో ముందు ముందు ఏదో జరగబోతోందన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

వంగా గీతకు మంత్రిపదవా ? ఆళ్ల, మర్రి, గ్రంధి నవ్వుకుంటారు జగన్ గారూ !

కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు....

గతానికి భిన్నంగా ఎన్నికలు… ఏపీ ప్రజల మద్దతు ఎవరికీ..?

ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ - కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close