హవాలా నడిచింది ఆ దుకాణాల ద్వారానే !?

హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ సోదాల్లో కీలక రాజకీయ నేతల బండారాన్ని బయటకు లాగే ప్రయత్నాలున్నాయని గుసగసులు వినిపిస్తున్నాయి. బట్టల దుకాణాలు, సెల్ ఫోన్ల షాపులను ఒక్క సారిగా ఐటీ అధికారులు టార్గెట్ చేయడం కలకలం రేపింది. అయితే చూడటానికి అవి చిన్నవే కానీ వాటి కేంద్రంగానే పెద్ద ఎత్తున హవాలా మనీని ఇతర రాష్ట్రాలకు చేర వేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అనుకుని ఐటీ దాడులు చేసినవి కావని.. గత కొన్నాళ్లుగా చేసిన ట్రాన్సాక్షన్స్.. తో పాటు ఇటీవల జరిగిన ఐటీ, ఈడీ సోదాల్లో వెలుగు చూసిన వివరాలతో సోదాలు చేశారని అంటున్నారు

కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే లిక్కర్ స్కాంలో కూడా ఈడీ అధికారుల ుసోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చాలా పెట్టుబడులు… ఇతర రాష్ట్రాలకు తరలించిన నగదు విషయంలో కొన్ని అనుమానాస్పదంగా ఉండటంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీశారు. అవన్నీ బట్టల దుకాణాలు, సెల్ ఫోన్ దుకాణాల సంస్తల నుంచి వచ్చాయని తేలడంతో తీగ లాగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ట్రాన్సాక్షన్స్ లను గుర్తించిన ఐటీ అధికారు.. దాని ఆధారంగానే సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థల కదలికలు పెరిగాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ, ఈడీ అధికారులు పలుమార్లు సోదాలు చేశారు. అభిషేక్ రావును అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు మరికొన్ని అరెస్టులు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు ద‌ర్శ‌కుడితో కాజోల్ సినిమా

నిఖిల్ తో 'స్పై' చిత్రాన్ని తెర‌కెక్కించారు చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌ల‌పాటి. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారారు. బాలీవుడ్ స్టార్‌ కాజోల్ కీల‌క పాత్ర‌లో ఓ బాలీవుడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది....

‘రాజు యాద‌వ్’ రివ్యూ: మ‌రో ‘బేబీ’ బాధితుడు

Pratinidhi 2 movie review తెలుగు360 రేటింగ్ 1.5/5 -అన్వ‌ర్‌ హాస్య న‌టులంద‌రికీ ఎప్పుడో ఒక‌ప్పుడు 'హీరో' అయిపోవాల‌న్న కోరిక క‌లుగుతుంది. అది స‌హ‌జం. చాలామంది క‌మెడియ‌న్లు హీరోలుగా అవ‌తారం ఎత్తింది అందుకే. ఈ వ‌రుస‌లో గెట‌ప్...

పూణే యాక్సిడెంట్ కేసులో కొత్త మ‌లుపు… మ‌రీ ఇంత బ‌రితెగించాలా?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన పూణేలోని యాక్సిడెంట్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. మైన‌ర్ అయిన బ‌డా పారిశ్రామికవేత్త కొడుకు మ‌ద్యం మ‌త్తులో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్ద‌రు అమ్మాయిల మృతికి కార‌ణం అయ్యాడు....

వైసీపీ గెలుపు ధీమా…అసలు విషయం ఇదే..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంతా ఓ అంచనాకు వచ్చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం పక్కా అని తేల్చేస్తున్నారు. వైసీపీ నేతల వ్యవహారశైలి కూడా భిన్నంగా కనిపిస్తోంది. తీవ్ర ప్రజా వ్యతిరేకత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close