కేసీఆర్ బాటలోనే జగన్.. మంత్రులపై పక్కా నిఘా..!?

తెలంగాణ మంత్రి ఒకరు… ప్రైవేటు సంభాషణల్లో కేసీఆర్ కుటుంబసభ్యులపై కాస్త కటువుగా మాట్లాడారు. కామెడీ చేశారు. ఆ విషయం ఆయన కానీ… ఆయన ఎవరితో మాట్లాడారో వారు కానీ బయటకు చెప్పలేదు. రికార్డు చేయలేదు… ఆడియో క్లిప్ కూడా బయటకు రాలేదు. కానీ… ఆ మంత్రికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఏం తమాషా చేస్తున్నావా అని హెచ్చరికలతో తలంటించి పంపేశారు. ఇలా జరిగిందన్న విషయం మాత్రం బయటకు తెలిసింది.. ఆ మంత్రెవరు అన్నది మాత్రం తెలియదు.. తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితం.. ఇది హాట్ టాపిక్. దీన్ని బట్టి మంత్రులపై ఎలాంటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చని… తెలంగాణ మంత్రులు ఓ నిర్ణయానికొచ్చేశారు.

ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితే. మంత్రులు ఏం చేస్తున్నా… తాడేపల్లికి తెలిసిపోతోంది. ఎంతలా అంటే… ఇటీవల ఓ మంత్రి… ఓ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో జోక్యం చేసుకున్నారు. సర్దుబాటు చేద్దామనుకున్నారు. కానీ.. నేరుగా ఆయనకు ఉన్నత స్థాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వివాదంతో నీకేం సంబంధం అని ప్రశ్నించడంతో ఆ మంత్రి తత్తరపడిపోయారు. తాను ఆ జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు… కానీ పై నుంచి మాత్రం…. వార్నింగ్‌లే వచ్చి పడ్డాయి. ఆ వివాదం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. దాంతో ఆ మంత్రి చిన్న బుచ్చుకున్నారు. సైలెంటయిపోయారు. ఇది బయటకు తెలిసిన ఓ ఉదాహరణ మాత్రమే.. చాలా మంది మంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

మంత్రుల వ్యవహారశైలి బాగో లేకపోయినా.. ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా.. దందాల్లో వేలు పెట్టినా… వెంటనే..పై స్థాయికి తెలిసిపోయే వ్యవస్థను… వైసీపీ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారని… వైసీపీ ప్రజాప్రతినిధులు అంచనాకు వచ్చేశారు. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మంత్రులుగా తీసేస్తానని జగన్ చెప్పారు. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది. మరో ఏడాది మాత్రం మిగిలింది. ఎవరెవరు విధేయులో అంచనా వేయడానికి ఇప్పటి నుండే ప్రభుత్వ పెద్దలు… క్రాస్ చెక్ చేసుకుటున్నారన్న చర్చ మాత్రం.. అధికార పార్టీలో నడుస్తోంది. నిఘా నీడలోనే తాము ఉన్నామని క్లారిటీకి వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close