సూటిగా సందేశం – పేటలో కూటమి సభ సూపర్ హిట్ !

వైసీపీని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆదుకునేందుకు మేం సర్వశక్తులు ఒడ్డుతాం… ప్రజలు కూడా కూటమిపై అచంచలమైన నమ్మకంతో ఉన్నారని చెప్పేందుకు ఏర్పాటు చేసిన కూటమి తొలి బహిరంగసభ అంచనాలను మించి అద్భుత విజయాన్ని సాధించింది. ఏ రాజకీయ పార్టీకి అయినా వచ్చే జన సందోహంలో ఉండే స్పందనను బట్టి .. పరిస్థితుల్ని అంచనా వేయవచ్చు. ఈ సభలో ప్రసంగాలు పూర్తయ్యే వరకూ ఒక్కరు కూడా బయటకు వెళ్లలేదు. సభ పూర్తయ్యే వరకూ వస్తున్నారు. మూడు వందల ఎకరాల ప్లేస్‌లో జనం పూర్తిగా నిండిపోయారు. ఇంకా రోడ్ల మీద పది కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జాం అయింది. ప్రసంగించిన నేతలు కూడా.. స్పష్టమైన సందేశం ఇచ్చారు.

కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదన్న మోదీ

జగన్ రెడ్డి గత ఐదేళ్లుగా బీజేపీకి మద్దతుగా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కేసులు ఆలస్యమవుతున్నాయన్న వాదన ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జగన్ స్థానమేంటో స్పష్టంగా చెప్పారు. జగన్, కాంగ్రెస్ వేర్వేరు కాదని స్పష్టం చేశారు. అంటే జగన్ ను మోదీ కాంగ్రెస్ నేతగానే పరిగణిస్తున్నారు. అవసరార్థం.. జగన్ మద్దతు విషయంలో కామ్ గా ఉండవచ్చేమో కానీ.. ఇతర విషయాల్లో ఆయనను క్షమించే అవకాశం ఉండదనిస్పష్టం చేసినట్లుగా అవుతుంది. ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లుగా మంత్రులు పోటీ పడి అవినీతి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపాలి అని బలంగా కోరుకుంటున్నారని తేల్చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. రాష్ట్రంలో మనం గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం అన్నారు.

కూటమి బలాన్ని ప్రజలకు తెలిసేలా చేసిన చంద్రబాబు

కూటమి అవసరాన్ని, బాలాన్ని ప్రజలకు తెలిసేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్అయ్యారు. తన ప్రసంగంలో 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఏపీకి లభించిన ప్రయోజనాలను వివరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానుల మూడు ముక్కలాటతో అమరావతిని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చినట్లు గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం అన్నారు. గతంలో కేంద్రం సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేయగా.. అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఈ ప్రజాగళం సభ. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు ఏపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. వైసీపీ పాలనలో గత ఐదేళ్లలో విధ్వంసం జిరగింది, ప్రజల జీవితాలు నాశనం అయ్యాయి కనుక ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు మూడు పార్టీలు జత కట్టాయని కూటమి ఆవశ్యకతను చంద్రబాబు వివరించారు.

కూటమికే పీఠం ఖాయమన్న పవన్ కల్యణ్

రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పవన్ కల్యాణఅ ధీమా వ్యక్తం చేశారు. ‘సీఎం జగన్ ఓ సారా వ్యాపారి. దేశమంతా డిజిటల్ వైపు అడుగులేస్తూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే.. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో మాత్రం నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40 వేల కోట్లు దోచేశారు. రాష్ట్రం డ్రగ్స్ కు రాజధానిగా మారింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈ రోజు -3 శాతానికి పడిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.’ అని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో రామరాజ్యం స్థాపన జరగబోతోందని పవన్ అన్నారు. ‘ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసురుడిని తీసేయడం కష్టం కాదు. వచ్చే ఎన్నికల్లో ధర్మానిదే విజయం. పొత్తుదే గెలుపు.. కూటమిదే అధికారం. అమరావతికి అండగా ఉంటామని చెప్పేందుకే మోదీ వచ్చారన్నారు.

పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించిన సభ కావడంతో దేశం మొత్తం ఆసక్తి చూపించింది. జాతీయ మీడియా కూడా సభను కవర్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సభ కావడంతో దేశమంతా ఆసక్తి చూపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close