ఈ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తే హ్యాపీ అంటున్న ల‌క్ష్మీనారాయ‌ణ‌..!

ఏపీలో ఎక్క‌డ చూసినా నాయ‌కుల ప‌ర్య‌ట‌న‌లు, యాత్ర‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార ప్ర‌తిప‌క్షాలు న‌వ నిర్మాణ దీక్ష‌లు, పాద‌యాత్ర‌లు అంటూ హ‌డావుడి చేస్తున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌జా పోరాట యాత్ర చేస్తున్నారు. అయితే, వీళ్లంద‌రితోపాటు మ‌రోప‌క్క సైలెంట్ గా త‌న ప‌ర్య‌ట‌న‌లు కొనసాగిస్తూ ఉన్నారు వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మ‌త్స్య‌కార గ్రామాల‌కి వెళ్లారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని, వారి స్థితిగ‌తుల‌ను తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్ర‌జ‌ల జీవన శైలి ఎలా ఉంటోంద‌నేది తెలుసుకోవ‌డం కోస‌మే ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా అన్నారు.

తాను కొంత‌మంది రైతులతో మాట్లాడాన‌నీ, ప‌నికి ఆహార ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది చెప్పార‌న్నారు. ఎందుకంటే, వ్య‌వ‌సాయ ప‌నులు చేసేందుకు కూలీలు దొర‌క‌డం లేద‌నీ, అందుకే ప‌నికి ఆహారం, వ్య‌వ‌సాయం అనుసంధానం చేస్తే రైతుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. ఈ ప్రాంతంలో కొంత‌మంది క‌ళాకారుల కుటుంబాల‌ను కూడా క‌లుసుకున్నాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి త‌న‌పై వ‌స్తున్న క‌థ‌నాల గురించి స్పందించారు. మీడియాతోపాటు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు తానూ చూస్తున్నాను అన్నారు. త‌న‌కు గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయం అంటే చాలా ఇష్ట‌మైన అంశాల‌న్నారు. ఈ విష‌యాల‌పై ప‌నిచేద్దామ‌ని ఎన్‌.ఐ.ఆర్‌.డి.లో ప‌నిచేద్దామ‌ని అప్లై చేశాన‌నీ, తాను పోలీస్ లో ఉండ‌టం వ‌ల్ల గ్రామాభివృద్ధిలో అనుభ‌వం లేద‌ని తిర‌స్క‌రించాన్నారు. కాబ‌ట్టి, త‌న మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేయడం కోసం పోలీస్ ఉద్యోగం వ‌దిలేశాన‌న్నారు.

అందుకే, ఇప్పుడు తాను గ్రామాల్లో తిరుగుతున్నాన‌నీ, రైతులూ మ‌త్స్య‌కారులూ క‌ళాకారుల‌ను క‌లుస్తున్నా అన్నారు. వీళ్ల స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కారాలు ఆలోచించాల‌న్నారు. స‌మ‌స్య‌ల‌తోపాటు ప‌రిష్కారాలు కూడా ప్ర‌భుత్వాల‌కు తాను తెలియ‌జేస్తా అన్నారు. ప‌రిష్కారాలు ఎవ‌రు సాధించినా ఫ‌ర్వాలేద‌నీ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చూపిస్తే ఇంకా మంచిదే అని ల‌క్ష్మీనారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు. నిజానికి, స‌మ‌స్య‌లపై అధ్య‌య‌నం చేసి.. వాటిని ప్ర‌భుత్వం ముందు ఉంచుతాన‌నీ, దానిపై వ‌చ్చే స్పంద‌న ప్ర‌కారం త‌న కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని ఇదివ‌ర‌కే ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. స‌మ‌స్య‌ల‌తోపాటు ప‌రిష్కారాలు కూడా తానే చెబుతాన‌నీ చెబుతున్నారు. మరి, తన అధ్యయనం పూర్తి చేసుకుని.. పరిష్కార మార్గాలతో ప్రభుత్వం ముందుకు ఎప్పుడు వెళతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close