జితేందర్ శర్మ.. జగన్ కన్నా బలవంతుడు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జి. ఆయన టార్గెట్ చేస్తే.. కోడెల లాంటి రాజకీయ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు జీతాల్లేకుండా.. పోస్టింగుల్లేకుండా.. గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలి. కానీ ఇలా టార్గెట్ చేసిన ఓ ఆఫీసర్‌ జగన్‌కు చుక్కలు చూపించారు. ఎంతలా అంటే.. ఏ పోస్టు నుంచి తనను తీసేశారో.. మళ్లీ అదే పోస్టులో.. అత్యంత గౌరవం… తక్షణం ఆదేశాలు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసుకునేంతగా. ఈ జితేందర్ శర్మ పేరు పెద్దగా బయటకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కలలోకి కూడా వస్తూంటారని.. ఏపీ అధికారవర్గాలు.. సెటైరిక్‌గా చెబుతున్నాయి.

విశాఖ మెడ్‌టెక్‌జోన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గా డాక్టర్‌ జితేందర్‌ శర్మను నియమిస్తూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పింది. దీన్ని చూసి.. అధికారవర్గాలు ఆశ్చర్యపోయాయి. దీనికి కారణం.. ఇప్పటికే జితేందర్ శర్మను ప్రభుత్వం రెండు సార్లు తొలగించింది. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కేసులు పెట్టింది. విచారణకు ఆదేశించింది. కానీ చివరికి అన్నీ కాదని.. మళ్లీ అదే పోస్టులో నియమించింది. చంద్రబాబు హయాంలో.. విశాఖలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటయింది. మెడికల్ డివైజ్ సెజ్ అయిన ఆ జోన్‌లో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. ఆలోచన చంద్రబాబుదే అయినప్పటికీ.. మొదటి నుంచి ఈ జోన్ బాధ్యతను.. చంద్రబాబు జితేందర్ శర్మ అనే అధికారికి ఇచ్చారు. ఆయన అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఈ జోన్ పనితీరు చూసి కేంద్ర ప్రభుత్వం కూడా అబ్బురపడింది. ఫేజ్ టూ కూడా ప్రారంభించారు.

ఈ లోపు ప్రభుత్వం మారడంతో… జగన్మోహన్ రెడ్డి దృష్టి ఈ మెడ్‌టెక్ జోన్‌పై పడింది. వెంటనే… అందులో అక్రమాలు జరిగాయని.. ఆరోపిస్తూ.. విజిలెన్స్ విచారణకు ఆదేశించి…జితేందర్ శర్మను.. తొలగించేశారు. అలా తొలగించిన వెంటనే… మెడికల్ కంపెనీలన్నీ నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు కూడా.. కేంద్రానికి ఈ వ్యవహారంపై లేఖలు రాశాయి. పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరాయి. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. మామూలుగా తన మార్క్ ట్రీట్‌మెంట్ అనుకున్న జగన్‌కు.. కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడితో షాక్ తగిలినట్లయింది. అయితే.. మళ్లీ ఆయనను అదే పోస్టులో నియమిస్తే జగన్ అహం దెబ్బతింటుంది. అందుకే సలహాదారుగా నియమించారు. అయినా.. ఒత్తిడి తగ్గలేదు. చివరికి.. మళ్లీ మెడ్‌టెక్‌ జోన్‌ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగన్ కన్నా.. జితేందర్ శర్మనే బలవంతుడని.. ఐఏఎస్ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close