తెలంగాణ రాజకీయాల్లోనే కల్వకుంట్ల కవిత !

తెలంగాణ రాజకీయాల్లోనే ఉండాలని కల్వకుంట్ల కవిత తేల్చుకున్నారు. కుటుంబం నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఒత్తిడి వచ్చినా ఆమె అంగీకరించలేదు. దీంతో చివరికి ఆమె సిట్టింగ్ సీటు.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును ఆమెకే కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసినా నిజామాబాద్ అంశం మాత్రం పెండింగ్‌లో ఉంది. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యులతో చర్చించి చివరికి కవితను ఎమ్మెల్సీగానే పోటీ చేయించాలని నిర్ణయించారు.

నిజామాబాద్‌లో ఓటమి తర్వాత పార్టీలో క్రియాశీలకంగా కనిపించలేదు. దీంతో అనేక రకాల ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్లు కవిత సైలెంట్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలను పట్టించుకోలేదు. తర్వాత నిజామాబాద్స్థానిక మండలి ఎన్నికల్లో కవితను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. భారీ మెజార్టీతో కవిత గెలిచారు. అప్పటికే కవితకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం ప్రగతిభవన్ నుంచే సాగింది. కానీ మంత్రి పదవి మాత్రం కవితకు దక్కలేదు.

కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ప్రచారం నేపధ్యంలో కవితను ఢిల్లీకి పంపాలని అనుకున్నారు. దీనికి అనుగుణంగానే రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్‌ను మండలిలోకి తీసుకున్నారు. కవిత కోసమే ఆ స్థానాన్ని ఖాళీ చేయించారని పార్టీ వర్గాల్లోనూ ప్రచారం జరిగింది. కానీ, కవిత మాత్రం కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదంటున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా తండ్రిపై అలిగారనే చర్చ కూడా సాగింది. ప్లీనరీకి కూడా వెళ్లలేదు. కేటీఆర్, కవిత మధ్య పొసగడం లేదని ఇప్పుడు ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే టీఆర్ఎస్‌లో కుటుంబ సమస్యలు పెరిగిపోతాయన్న ఆందోళన క్యాడర్‌లోఉంది. కానీ కేసీఆర్ కూడా వీటిని పరిష్కరించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close