జాతీయ రాజకీయ వ్యూహంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు..!

తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. క‌నీసం కొన్ని ప్ర‌ముఖ శాఖ‌లకు మంత్రుల‌తోనైనా ప్ర‌మాణం చేయించ‌లేదు. సెంటిమెంట్ కోసం త‌న‌తోపాటు మ‌రొక‌రితో కార్య‌క్ర‌మం మ‌మ అనిపించేశారు. వాస్త‌వానికి, పేరేడ్ గ్రౌండ్ లో అట్ట‌హాసంగా ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌నీ, సంబ‌రాలు ధూం ధామ్ గా ఉంటాయ‌ని కార్య‌క‌ర్త‌లూ ఆశించారు. కానీ, నిరాడంబ‌రంగా ఈ కార్య‌క్ర‌మం ముగించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చి రెండ్రోజులైనా మంత్రి మండ‌లి కూర్పు అంశమై కేసీఆర్ ఇంకా ఆలోచించ‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే, ప్ర‌స్తుతం ఆయ‌న ఆలోచ‌న అంతా జాతీయ రాజ‌కీయాలవైపు ఉంద‌నేది కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌చ్చిన త‌రువాతి నుంచి వ‌రుస‌గా ఆయ‌న పాల్గొన్న మీడియా స‌మావేశాలే తీసుకుంటే… ఎక్కువ‌గా జాతీయ స్థాయి స‌మ‌స్య‌లు, రాజ‌కీయాల గురించే మాట్లాడుతూ వ‌చ్చారు. దానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ గురించే ఎక్కువ‌గా మాట్లాడారు. త్వ‌ర‌లోనే ఢిల్లీ వెళ్లి, విధివిధానాల‌ను వెల్ల‌డిస్తానంటూ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర క్యాబినెట్ కూర్పులో కూడా కేసీఆర్ జాతీయ రాజ‌కీయ ఆలోచ‌నా విధానం ప్రాతిప‌దిక ఉండే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కులాలవారీగా మంత్రివ‌ర్గంలో స‌భ్యుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే క‌స‌ర‌త్తు ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఈసారి మ‌హిళా మంత్రికి అవ‌కాశం ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌తోపాటే మహ‌మూద్ అలీతో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌డం ద్వారా మైనారిటీల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను ముందే చెప్పేశారు. అయితే, ప్ర‌స్తుతం కేసీఆర్ పార్టీకి చెందిన‌ కొంత‌మందితో వ‌రుస‌గా స‌మావేశ‌మౌతార‌ని తెలుస్తోంది. త‌న‌తోపాటు జాతీయ రాజ‌కీయాల‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మైన‌వారిని ఎంపిక చేసుకుంటార‌ట‌! ఇప్ప‌టికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలోంచి కూడా ఈ ఎంపిక ఉంటుంద‌ని అంటున్నారు. ఈ స‌మాలోచ‌న‌ల అనంత‌రం రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెరాస త‌ర‌ఫున ఎంపీలుగా పోటీ చేసివారిపై కూడా కొంత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌మాచారం.

మంత్రి వ‌ర్గంలో చోటు ఆశిస్తున్న‌వారిలో కొంత‌మందికి పదవి దక్కదని చెబుతూ… త‌న వెంటే ఉండే టీమ్ లో స‌భ్యులుగా కొన‌సాగుతార‌నే భ‌రోసా ఇవ్వ‌డం, మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి ఆస్కారం లేనివారికి ఇత‌ర అంశాల్లో ప్రాధాన్య‌త ఉంటుంద‌నే హామీలను కేసీఆర్ ఇస్తార‌నీ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తానికి, జాతీయ రాజ‌కీయాల‌పైనే కేసీఆర్ ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంద‌నేది అర్థ‌మౌతోంది. ఆ వ్యూహంతోనే మంత్రివ‌ర్గం కూర్పుపై ప్ర‌భావం ఉండొచ్చ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close