ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. కాంగ్రెస్ లో పరిస్థితేం బాలేదు.. వచ్చేయమంటే ఇప్పుడే వచ్చేస్తానన్నారట. కేసీఆర్ కేసీఆర్ మాత్రం ఇప్పుడే వద్దు అని చెప్పానంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు అటూ ఇటూ అయితే మైనార్టీలో పడిపోయే ప్రభుత్వాన్ని ఇరవై మంది ఎమ్మెల్యేలతో సహా వస్తానంటే కేసీఆర్ వద్దనడం అంటే మామూలు విషయం కాదు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఇలాంటి మాటలు చాలా చెప్పారు.

బీఆర్ఎస్ కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్నారు. తాము దొరకబట్టుకున్నామని అందుకే మోదీ కక్ష కట్టారని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల్ని పంపామని .. అందుకే అమిత్ షా, మోదీ కక్ష కట్టి.. కవితను అరెస్టు చేయించారన్నది కేసీఆర్ వాదన. లిక్కర్ కేసు ఉత్తదేనని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ ఇప్ప‌టి వ‌ర‌కు 8 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రో మూడు స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మెజార్టీ సర్వేలు.. ఒకటి, రెండు అని చెబుతున్నా.. పార్టీ నేతల్లో ధైర్యం నింపడానికి పెద్దగా ఊరూపేరూ లేని సర్వేలను బీఆర్ఎస్ మీడియా హైలెట్ చేసి.. అదే సర్వేలని నమ్మబలుకుతోంది. కేసీఆర్ కూడా అదే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ మాటల్నీ ఏమవుతాయో కానీ.. కేసీఆర్ చెప్పిన విషయాలన్నింటినీ బీఆర్ఎస్ నేతలు సీరియస్ గా ఆలకించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close