ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తే చాలనుకుంటున్న కేసీఆర్..!?

తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల్లో ఎందుకు ఆదరణ తగ్గింది..?. కేసీఆర్ పరిపాలన నచ్చడం లేదా..? లేక మరే కారణమైనా ఉందా.. అన్న దానిపై మేథోమథనం జరపిన టీఆర్ఎస్ నేతలకు అసలు కారణం.. ఎమ్మెల్యేల దగ్గర కనిపిస్తోంది. వారి తీరు వల్లే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతోందని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతి కొద్ది మంది మినహా .. మిగతా ఎమ్మెల్యేలు అంతా.. అధికారం ఉందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని.. ప్రజలకు సేవ కాకుండా.. వారిపై అజమాయిషీ చేస్తూ… టైం పాస్ చేస్తున్నారని తేలినట్లుగా తెలుస్తోంది. వివాదాస్పదంగా వ్యవహరించడం.. ప్రజా సమస్యల పట్ల పెద్దగా స్పందించకపోవడం.. అసలు అందుబాటులో ఉండకుండా సొంత వ్యాపారాలు . .ఇతర వ్యవహారాలకు సమయం కేటాయిస్తూండటంతో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు పార్టీకి నష్టం చేస్తున్నట్లుగా నిర్ణయానికి వచ్చారు.

పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేసిన కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే హుటాహుటిన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వ మార్పు.. ముఖ్యమంత్రి మార్పు వంటి అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేసే చాన్స్ లేదు. కానీ ప్రజల్లోకి.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వెళ్లే అవసరాన్ని.. ఎమ్మెల్యేలు హెడ్ వెయిట్‌ను ఎలా తగ్గించుకోవాలన్నఅంశాన్ని తనదైన శైలిలో చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయం ఇప్పుడు టీఆర్ఎస్ లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిని కేటీఆర్ గతంలోనే వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్ల తీరు వల్లే అత్యధిక సీట్లను కోల్పోయామని.. ఎమ్మెల్యేలు దాన్ని పాఠంగా తీసుకోవాలని గతంలోనే హెచ్చరించారు. చాలా మంది ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు. అయితే ఎమ్మెల్యేలందరూ ఎవరి రాజకీయంవారు చేస్తున్నారు. ఎవరూ మారడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ టిక్కెట్లు ఇచ్చారు.. ఈ సారి అందరికీ ఇవ్వరన్న హెచ్చరికలు పంపుతున్నారు. ప్రణాళిక ప్రకారం.. ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది. కార్యవర్గభేటీ తర్వాత వారికి ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశంఉంది. మొత్తంగా టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close