చిరు సంగ‌తి తేల్చ‌ని కీర్తి

చిరంజీవి `వేదాళం` రీమేక్‌లో ఓ కీల‌క‌మైన పాత్ర వుంది. క‌థానాయ‌కుడి సోదరిగా ఆ పాత్ర‌లో కీర్తి సురేష్ కనిపిస్తుంద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ పాత్ర కోసం సాయి ప‌ల్ల‌వి, కీర్తి సురేష్‌ల పేర్లు చ‌ర్చ‌ల్లో వినిపించాయ‌ని, చిరు కీర్తి సురేష్‌ని ఫిక్స్ చేశార‌ని చెప్పుకున్నారు.

అయితే.. కీర్తి మాత్రం ఈ విషయంలో మౌనంగానే వుంది. `మిస్ ఇండియా` బుధ‌వారం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌చారంలో భాగంగా మీడియాతో కీర్తి మాట్లాడింది. అయితే ఈ సంద‌ర్భంలో ఎక్క‌డా `వేదాళం` రీమేక్ ప్ర‌స్తావ‌న రాకుండా జాగ్ర‌త్త ప‌డింది. ”స‌ర్కారువారి పాట త‌ర‌వాత‌.. ర‌జ‌నీకాంత్ తో `అణ్ణాత్తే` లో న‌టిస్తున్నా. మోహ‌న్ లాల్ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నా. బాలీవుడ్ `మైదాన్‌`లో నేను న‌టిస్తున్నా అనే వార్త‌ల్లో నిజం లేదు. ప్ర‌స్తుతానికి నేను ఒప్పుకున్న సినిమాలివే” అని తేల్చేసింది. ‘వేదాళం’ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తీసుకురాలేదు. అయితే.. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్ ఎగ్రిమెంట్ల ద‌శ‌లో ఉంద‌ని, అందుకే కీర్తి బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని, చిత్ర‌బృందంమే ఈ విష‌యంలో అధికారికంగా స్పందించాల‌ని తాను ఎదురు చూస్తోంది కీర్తి స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close