పవన్ ను కలిసేందుకు కొడాలి నాని ప్రయత్నం – రివర్స్‌లో !

కొడాలి నాని కొన్నాళ్లుగా నోరు తెరవలేదు. ఈ మధ్య కాలంలో ఆయనకు క్యాన్సర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా ఆయన తెరపైకి వచ్చారు. తాను పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నం చేశానని కానీ కుదరలేదన్న విషయాన్ని ప్రకటించారు. గుడివాడలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన అన్న ఈ మాటలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

కొడాలి నాని ఈ ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు చంద్రబాబు, లోకేష్ ను ఎప్పట్లాగే బూతులు తిట్టారు. అయితే పవన్ కల్యాణ్‌నుకలిసేందుకు చాలా ప్రయత్నం చేశానని కానీ కుదలేదని చెప్పడం ద్వారా అందరి ద్రాక్షన పుల్లన అనే నక్క తరహాలో ఇప్పుడు బూతులు అందుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ను కలిసేందుకు కొడాలి నాని చేసిన ప్రయత్నం… జగన్ రెడ్డికి తెలిసిందని అందుకే.. వివరణకు ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టారని అంటున్నారు.

చంద్రబాబు గెలవడని చెప్పేందుకు.. ఆయనకు మద్దతుగా ఉండకూడదని చెప్పేందుకు పవన్ ను కలిసేందుకు ప్రయత్నించానని చెప్పారు. కుదరకపోవడంతో మీడియా ద్వారా చెబుతున్నానని అంటున్నారు. అంటే.. తాను పవన్ ను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో హైకమాండ్‌కు ఇలా వివరణ ఇచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ప్రయత్నాలు ఫలించకపోవడం.. ఇటు జగన్ రెడ్డి కూడా నమ్మే పరిస్థితి పోతుందేమోనన్న భయంతో మళ్లీ బూతులు అందుకున్నారన్న వాదన వైసీపీలో వినిపిస్తోంది. మొత్తంగా కొడాలి గూడుపుఠాణీ ఏదో చేస్తున్నారని మాత్రం ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close