బావా… ఎప్పుడు మద్దతిచ్చెదవీవు..!!

ఇది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా పాడుతున్న పద్యం. ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలంటే బావ, సహచర మంత్రి తన్నీర్ హరీష్ రావు అడ్డంకిగా ఉన్నారని చాలా కాలంగా పార్టీలో వినిపిస్తోంది. ఈ విషయాన్ని కేటీఆర్ సన్నిహితులు కూడా ఆయన చెవిలో వేసినట్లు చెబుతున్నారు. కుమార రత్నానికి సీఎం పీఠం కట్టబెడితే మేనల్లుడు హరీష్ రావు నుంచి వ్యతిరేకత వస్తుందనే అనుమానం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావును వెంటాడుతోంది అంటున్నారు. ఈ కారణంగానే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం దూరం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని ద్రష్టిలో ఉంచుకునే కుమారుడికి మెల్లిమెల్లిగా ఒక్కో బాధ్యతలు అప్పగిస్తున్నారని, దీని ద్వారా పార్టీలో పట్టు సాధిస్తారన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావు తన వర్గం వారితో తిరుగుబాగు చేసే అవకాశం ఉందా అని కూడా ఆలోచనలో పడ్డారని సమాచారం. మరోవైపు అవకాశం కోసం ఎదురుచూస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర్ర సమితిలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. పార్టీలో ఏదైనా తిరుగుబాటు వంటిది వస్తే శాసనసభ్యుల బలం లేకపోయినా కేంద్రం నుంచి మద్దతు తెలపాలన్నది బీజేపీ అధిష్టానం ఎత్తుగడగా ఉందంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బావ, సహచర మంత్రి అయిన తన్నీర్ హరీష్ రావును తన వైపు తిప్పుకుని ఆయన నుంచే ప్రతిపాదన వచ్చేలా చేయాలన్నది కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఇటీవల చాలాసార్లు మంత్రి హరీష్ రావుతో మాట కలపడం, ఆయన దూతలను హరీష్ వద్దకు పంపడం వంటివి చేస్తున్నారంటున్నారు. మరోవైపు హరీష్ రావు కూడా తన పని తాను చేసుకుంటున్నారే తప్ప పార్టీ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా బావ హరీష్ రావు మద్దతు లభిస్తే ఇక మిగిలిన పనిని తండ్రి పూర్తి చేస్తారని కే.తారక రామారావు నమ్మకంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close