ఢిల్లీ బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్‌కు కేటీఆర్ దూరం !

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి కీలక నేతలందరూ హాజరు కావాలని ఆదేశించారు. రెండు రోజుల ముందుగానే మంత్రులందరూ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కీలక ప్రోగ్రాంకు.. కేటీఆర్ దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్… ఇప్పుడు కూడా ఆ పార్టీకి అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంటే. అయినప్పటికీ ఆయన ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన సమావేశాలు ఉన్నందునే వెళ్లడం లేదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయా అని టీఆర్ఎస్‌లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కల్వకుంట్ల కవిత మాత్రం ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ గురించి ఆమె మాత్రమే మాట్లాడుతున్నారు. కేటీఆర్ పెద్దగా స్పందించడం లేదు. ఈ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ విషయంపై ఏదో అంతర్గత చర్చ నడుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ తెలంగాణకు పరిమితమని.. కవితను.. జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనుకంటున్నారని.. చెబుతున్నారు. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.

గతంలోనే పార్టీ, ప్రభుత్వం పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విబేధాలొచ్చాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కొంత కాలం పాటు టీఆర్ఎస్ అధికారిక పత్రికలో కవిత పేరు కూడా కనిపించలేదు. తర్వాత అంతా సర్దుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పెద్దగా ఘటనలు బయటకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను కవితకు.. తెలంగాణ రాజకీయాలు కవితకు అప్పజెప్పడం ద్వారా కేసీఆర్ సమస్యను పరిష్కరించారని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close