క్రైమ్ : ఆ లేడీ పోలీస్ నిత్య పెళ్లి కూతురు..!

పోలీస్‌కు క్రిమినల్ ఆలోచనలు రావాలి. ఎందుకంటే.. క్రిమినల్స్‌ని పట్టుకోవాలి కాబట్టి. కానీ ఆ క్రిమినల్ పనులు చేయాలనుకుంటే మాత్రం మొత్తం పరిస్థితి తేడా వస్తుంది. అసలే పోలీస్.. ఆపై క్రిమినల్ పనులంటే ఇక ఆ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్తుందో చెప్పడం కష్టం. అదే లేడీ పోలీస్ అయితే.. ఇక ఊహించడం కష్టం. ఓ లేడీ కానిస్టేబుల్ అదే పని చేసి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆమె పేరు సంధ్యారాణి. కానిస్టేబుల్ ఉద్యోగం. కానీ హైదరాబాద్‌ లేడి కానిస్టేబుల్ రూటు సెపరేటు. ఆమె అలా కాదు. డబ్బులున్న అబ్బాయికు ఎర వేయడం, స్నేహం చేయడం, తర్వాత ప్రేమ అనడం…పెళ్లి చేసుకోవడం…తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం….ఆమె పని ఇదే. ఇంకా వినకుంటే…ఎస్సీ,ఎస్టీ కేసులు పెడతానని, బెదిరించడం. హైదరాబాద్‌లోని ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న సంధ్యారాణి … ఇప్పటికే గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని… డైవర్స్ ఇచ్చింది. అందులో ఒక బాధితుడు ఈమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజాగా శంషాబాద్ మండలం హైతబాద్‌కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది. ప్రేమ పేరుతో వచించింది. పెళ్లి చేసుకోకపోతే…అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించింది. తర్వాత పెళ్ళి కూడా చేసుకుంది. కాని అంతకు ముందు చేసుకున్న పెళ్లిల విషయం చెప్పలేదు. ఇలా ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో ఉంచుకోకుండా….సెపరేట్‌ రూమ్‌లో గడుపుతోంది. ఇన్ని రోజులకు నిజం తెలుసుకున్న బాధితుడు చరణ్‌ తేజ…. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యారాణిపై ఫిర్యాదు చేశాడు. దీంతో సంధ్యారాణి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు సంధ్యారాణి వ్యవహారాన్ని లో ప్రోఫైల్‌లో ఉంచే ప్రయత్నం చేశారు కానీ.. ఈ కేసు అలాంటిలాంటిది కాబట్టి.. హైలెట్ అయిపోయింది. సంధ్యారాణి పోలీస్ సర్వీస్‌లో ఉంటే.. ఇంకా ఎన్నెన్ని వేషాలు వేసేదే ఏమో కానీ ఓ బాధితుడు మాత్రం తెర ముందుకు వచ్చాడు. దాంతో గుట్టు రట్టయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close