‘పోరునష్టం’ పాఠం నేర్చుకుంటారా ఇకనైనా!

‘పోరు నష్టం.. పొందు లాభం..’ అని సామెత! ఇది సార్వజనీనమైన సిద్ధాంతం. ప్రతి రంగానికీ వర్తించేదే. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి.. తెలుగుదేశం, భాజపా పార్టీలకు ప్రత్యేకంగా స్వానుభవంలోకి వచ్చిన సిద్ధాంతం ఇది అని మనం చెప్పుకోవాలి. ఈ రెండు పార్టీలు తెలంగాణలో కూడా మిత్రపక్షాలుగానే ఉన్నాయి. అసలే అధికార తెరాస విపరీతమైన బలంతో, మరింత బలాన్ని సంతరించుకుంటూ.. చెలరేగిపోతూ ఉంటే.. ప్రత్యర్థులు అయిన ఇలాంటి మిత్రపక్షాలు మరింతగా దగ్గరై కలసి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న కీచులాటలు వారిని దెబ్బ కొడుతూ వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వారి మైత్రి ఫలితం చూపలేకపోయింది. దాంతో తెదేపా ఇక మునిగిన పడవ అని డిసైడైపోయి.. అక్కడికి తమకేదో మహా బలం ఉన్నట్లుగా అతిగా ఊహించుకుంటూ.. భాజపా ఎన్నికల క్షేత్రంలో ఒంటరిగా దిగడానికిసాహసించింది. మూడు మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వారి తల కూడా దారుణంగా బొప్పి కట్టింది.
వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల ఫలితాలు వస్తే.. ఈ రెండు పార్టీలకు ఒక్కటంటే ఒక్క వార్డు కూడా దక్కలేదంటే.. అది వారి పతనానికి పరాకాష్ట. స్థానిక నాయకత్వం కోరిక మేరకు అనే ముసుగు వేసుకుని, తమ మధ్య మైత్రీ బంధాన్ని తెగ్గొట్టుకుని, తెలుగుదేశం- భాజపాలు విడివిడిగా దాదాపు అన్ని డివిజన్లకు పోటీచేశాయి. అంతో ఇంతో కాంగ్రెసుకైనా కొన్ని సీట్లు దక్కాయి గానీ.. ఈ రెండు పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు.

పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్లుగా.. ఈ రెండు పార్టీలు విభేదాల బారిన పడి.. కొట్టుకోవడం.. అంతిమంగా తెరాసకే లాభించింది. వారికి ప్రతిచోటా తిరుగులేని మెజారిటీలు లభించాయి. తమలో తాము కొట్టుకుంటే అది తమకే ఎక్కువ నష్టం కలిగిస్తుందనే నీతిని ఈ రెండు పార్టీల నాయకులు ఇప్పటికైనా తెలుసుకుంటే వారికి మనుగడ ఉంటుంది. లేకపోతే.. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టి ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో దుకాన్‌ బంద్‌ అయ్యే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close