మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరుపుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు

తమిళనాడు ప్రభుత్వం… కరుణానిధి అంత్యక్రియ స్థలం విషయంలో చేసిన రాజకీయ ప్రయత్నం బెడిసికొట్టింది. మెరీనాలో కురణానిధి అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. మెరీనాలో … అన్నాదురైన స్మారకం పక్కనే…కరుణానిధి స్మారకం ఉండాలని.. డీఎంకే నేతలు పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. గాంధీ మండపం ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ డీఎంకే అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ… అన్నాదురై స్మారకం పక్కనే.. కరుణ స్మారకం ఉండాలని పట్టుబట్టారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. మెరీనా స్థలం ఇవ్వకపోవడానికి ప్రభుత్వం మొదట… హైకోర్టులో పెడింగ్ లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలను చూపించింది. దీంతో.. ఆ వ్యాజ్యాలు దాఖలు చేసిన వారంతా.. స్వచ్చందంగా వచ్చి వాటిని ఉపసంహరించుకున్నారు. తమ పిటిషన్లను ప్రభుత్వం … రాజకీయానికి వాడుకుందని మండిపడ్డారు.

ఈ ప్రయత్నం కూడా తేలిపోవడంతో… గతంలో మాజీ ముఖ్యమంత్రులకు.. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు… మెరీనాలో స్థలం కేటాయించలేదన్న విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ముందు వాదించింది. ఎంజీఆర్ భార్య, మాజీ ముఖ్యమంత్రి జానకీ రామచంద్రన్ కు … మెరీనా స్థలం కేటాయించని విషయాన్ని వారు గుర్తు చేశారు. దీనిపై డీఎంకే లాయర్లు తమ వాదన గట్టిగా వినిపించారు. జానకీ రామచంద్రన్‌కు, కురణానిధి పోలిక ఏమిటని ప్రశ్నించారు. అన్నాదురై… అభిమానం పొంది తన వారసుడిగా గుర్తించిన కరుణానిధిని ఆయన స్మారకం పక్కనే ఖననం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తమిళనాడులోని కోటి మంది డీఎంకే కార్యకర్తల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయంగా వాదించారు. చివరికి ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగానే హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

కరుణానిధి.. చివరి చూపు కోసం దేశంలోని దిగ్గజ ప్రముఖులంతా.. చెన్నైకి క్యూకట్టారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక మంది… చెన్నై వెళ్లి కరుణానిధికి నివాళులర్పించనున్నారు. మరో వైపు చెన్నై జనసంద్రమైంది. చివరి చూపు కోసం అభిమానులు రాజాజి హాల్ వైపు పోటెత్తుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com