నాన్న పుట్టిన రోజు వ‌ర‌కూ చెప్పుకోవాలి: మ‌హేష్‌బాబు

భ‌ర‌త్ అనే నేను సూప‌ర్ హిట్ మ‌హేష్‌బాబులో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇది వ‌ర‌కు మ‌హేష్ చాలా విజ‌యాలు చూసుండొచ్చు. కానీ భ‌ర‌త్ హిట్ ఇచ్చిన ఆత్మ‌విశ్వాసం వేరు. వ‌రుస‌గా రెండు భారీ ఫ్లాపుల త‌ర‌వాత వ‌చ్చిన తిరుగులేని హిట్ ఇది. అందుకే ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉత్సాహంగా క‌నిపిస్తున్నాడు. సినిమాని సూప‌ర్ హిట్ చేసి వ‌ద‌ల్లేదు. ప్ర‌మోష‌న్లు భారీగా చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాడు. రోజురోజుకీ ప్ర‌మోష‌న్ల జోరు పెంచుతున్నాడు. ఈరోజు హైద‌రాబాద్ లో గ్రాండ్ స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ వేడుక‌లోనూ మ‌హేష్ స‌రికొత్త ఉత్సాహంతో క‌నిపించాడు. ఇచ్చిన స్పీచే మ‌ళ్లీ రిపీట్ చేసినా.. అత‌ని ఆనందం మాత్రం స‌రికొత్త‌గా క‌నిపించింది.”మా అమ్మ పుట్టిన రోజున ఈ సినిమా విడుద‌లైంది. మే 31న నాన్న పుట్టిన రోజు. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా గురించి గొప్ప‌గా చెప్పుకోవాలి” అని మ‌హేష్ ఆకాంక్షించాడు. అప్ప‌టి వ‌ర‌కూ సినిమా నిల‌బ‌డాలి క‌దా, అందుకే ఈ రేంజులో ప్ర‌మోష‌న్లు చేస్తున్నాడేమో. ”ప్ర‌మోష‌న్ల బిజీతో వారం రోజుల నుంచీ తిరుగుతూనే ఉన్నా. ఇలాంటి రోజులు మ‌రిన్ని రావాలి. సీనియ‌ర్ న‌టుల ముందు న‌టించ‌డం గ‌ర్వంగా అనిపించింది. అభిమానులు న‌న్ను సూప‌ర్ స్టార్ అని పిలుస్తారు. నాకు వ‌రుస‌గా రెండు బంప‌ర్ హిట్లు ఇచ్చి నాలుగేళ్ల‌లో రెండు సార్లు లైఫ్ ఇచ్చారు కొర‌టాల‌. ఆయ‌న‌కెప్పుడూ రుణ‌ప‌డి ఉంటా” అంటూ కొర‌టాల‌పై త‌న అభిమానాన్ని మ‌రోసారి ప్ర‌క‌టించుకున్నాడు మ‌హేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close