రూ. 30 కోట్లు వదులుకున్న మహేష్ బాబు

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం కథానాయికలకే చెల్లింది. కథ, అందులో తమ పాత్ర ఎలా ఉన్నాసరే పారితోషికం కోసమో, పేరు కోసమో, కాంబినేషన్ కోసమో ఒప్పేసుకుంటారు. ఐతే స్టార్ హీరోల లెక్కకు వేరుగా ఉంటాయి. కథ నచ్చక పోయినా, కాంబినేషన్ పై ఏమాత్రం అనుమానాలు వున్నా ‘నో’ చెప్పాల్సిందే. అలాంటప్పుడు పారితోషికం ఎంత ఇస్తానన్నా వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితే మహేష్ బాబుకి ఎదురయ్యింది. మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ కోసం టాలీవుడ్ లో చాలా కథలు సిద్ధం అవుతున్నాయి. తమిళ్ దర్శకుడు సుందర్ సి కూడా మహేష్ ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రెడీ చేసాడట. మహేష్ ఒప్పుకుంటే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి పూర్తి చెయ్యాలనుకున్నాడట. అంతే కాదు… తమిళ మార్కెట్ కోసం జయం రవి నీ ఈ సినిమాలో తీసుకొచ్చి దీనికి మల్టీ స్టారర్ లుక్ తీసుకొద్దాం అనుకున్నాడు.

అందుకోసం మహేష్ కి రూ. 30 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది.

కావాలంటే మహేష్ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా పూర్తి చెయ్యడానికి కూడా రెడీ నే అన్నారట. కానీ మహేష్ మాత్రం సుందర్ సి తో సినిమా చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. మహేష్ నో చెప్పడంతో ఈ కథ కోసం మరో స్టార్ హీరో వేటలో పడ్డాడు సుందర్. ఒకవేళ వీలు కాకపోతే తమిళ హీరోలతోనే ఈ సినిమా పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close