చిత్ర‌మైన స‌మ‌స్య‌లో మారుతి

ప్ర‌తిరోజూ పండ‌గేతో ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు మారుతి. ఈ సినిమా కొన్న‌వాళ్లంద‌రికీ రూపాయికి రూపాయి మిగిలింది. నిర్మాత‌లు, పంపిణీదారులు హ్యాపీ. ఈ సినిమాతో మారుతి రేంజు కూడా పెరిగింది. అయితే ఇప్పుడు ఓ చిత్ర‌మైన స‌మ‌స్య‌లో ఉన్నాడు మారుతి. త‌న చేతిలో కొంత‌మంది నిర్మాత‌లు ఉన్నారు. ఇప్ప‌టికే అడ్వాన్సులు ఇచ్చేశారు. హీరోలు సైతం `నువ్వు క‌థ చెప్పు చేసేద్దాం` అనేవాళ్లే. కానీ ఏ ఒక్క‌రూ ప్ర‌స్తుతం ఖాళీగా లేరు. మారుతి ముందు ర‌వితేజ‌, రామ్‌… అనే రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ర‌వితేజ `క్రాక్‌`తో బిజీగాఉన్నాడు. రామ్ కూడా `రెడ్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ అయ్యేంత వ‌ర‌కూ మారుతి ఆగాలి. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు హీరోలు సైతం మారుతితో సినిమాలు చేయ‌డానికి రెడీ గా ఉన్నారు. అయితే.. ఏ హీరోకి ముందు కమిట్‌మెంట్ ఇవ్వాల‌న్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. ఓ హీరోకి మాటిచ్చేసి, తీరా త‌న కొత్త సినిమా ఫ్లాప్ అయితే.. ఆ భారాన్ని మారుతి మోయాల్సివుంటుంది. ఈ రిస్కు మారుతి చేస్తాడా? లేదంటే ప్ర‌స్తుతం ఏ హీరో ఖాళీగా ఉంటే ఆ హీరోతో స‌ర్దుకుపోతాడా.. అనేది ఆస‌క్తిగా మారింది. మారుతి ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు రెడీగా ఉన్నాయి. ఆ రెండు క‌థ‌ల‌కూ రామ్ పర్‌ఫెక్ట్‌గా సూటైపోతాడు. కాక‌పోతే `రెడ్` అయ్యేంత వ‌ర‌కూ ఆగాలి. మ‌రి మారుతి ఏం చేస్తాడో.?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close