అన్న బాలయ్యపై, తమ్ముడు ఎన్టీఆర్‌పై ..! ఈ కెలుకుడు మర్మమేమిటో..?

మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్.. అంతర్గతంగా ఏమైనా రాజకీయాలు చేస్తున్నారో లేదో కానీ.. బయటకు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయం కాబట్టి .. మిగతా ఇద్దరు సోదరులు.. కడుపులో చల్ల కదలకుండా రాజకీయాలు చేస్తున్నారు. ఇద్దరి సోదరుల రాజకీయం… ఓ కుటుంబం మీద మొత్తం తమ కడుపు మంట మొత్తం వ్యక్తం చేసి.. అదే రాజకీయం అనేలా మారిపోయింది. ఎన్టీఆర్ ఫ్యామిలీపై.. ఆయన కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… అంతటితో వచ్చే పబ్లిసిటీతో.. తమ రాజకీయం నడిచిపోతుందని ఆశిస్తున్నారు. ఈ ప్రకారమే.. మాటలతో విరుచుకుపడుతున్నారు.

చిరంజీవి తమ్ముడు.. పవన్ కల్యాణ్ అన్న అని మాత్రమే… ఇప్పటికీ గుర్తింపు కార్డు ఉంచుకున్న నాగబాబు.. కొద్ది రోజులుగా… నందమూరి తారక రామారావు కుమారుడు… బాలకృష్ణ మీద చెలరేగిపోతున్నారు. బాలకృష్ణ ..ఏళ్లు, పూళ్ల కింద ఏదో అన్నాడని.. ఊరూపేరూలేని చానల్స్ లో వచ్చాయంటూ.. ఇష్టం వచ్చినట్లు.. తిట్లు లంకించుకుంటున్నారు. వరుసగా వీడియోలు విడుదల చేశారు. ఇంకా బోర్ కొడుతోందని.. ఫీలయ్యామో కానీ.. కొత్తగా ఫినిషింట్ టచ్ ఇచ్చి మళ్లీ ప్రారంభించడానికి… మర్యాదగా చెబుతున్నా.. అని ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై ఆన్ లైన్ లో విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చాయి. సంబంధం లేని వారెవరో.. నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఆయన రియాక్టయ్యాడు. కానీ తననే అంటున్నా… ఆ వ్యాఖ్యల అర్థం పరమార్థం తెలుసు కాబట్టి… బాలకృష్ణ చిరునవ్వు నవ్వి నో కామెంట్ అనేశారు. ఆ రెస్పాన్స్ చూసిన తర్వాతైనా.. నాగబాబు ఆలోచించాల్సింది. కానీ ఆయన కోరుకున్నదేదో వస్తుంది కాబట్టి.. ఆయన కంటిన్యూ అయిపోతున్నారు.

ఈ కోవలోకి ఇప్పుడు తమ్ముడు కూడా వచ్చి చేరారు. ఆయన ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఎన్టీఆర్..మెదక్‌లో కుక్కను నిలబెట్టినా.. గెలుస్తుందని వ్యాఖ్యానించారట. అదే విషయం చెప్పి.. తనకు అంత గర్వం లేదని చెప్పుకొచ్చారు. ” ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు” అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ ఎన్టీఆర్‌తో పోల్చుకోవడం.. ఓ వింత అయితే.. ఆయనెంతో గర్వంతో రాజకీయాలు చేశారని.. అలాంటి రాజకీయాలు చేయనని చెప్పడం మరో వింత. ఇలా అన్నదమ్ములిద్దరూ… ఒకే సారి.. ఎందుకు ఒకే కుటుంబంపై.. విరుచుకుపడి పాపులారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నదానికి మాత్రం రాజకీయం అనే ఆన్సరే వస్తుంది. కానీ.. ఇలాంటి రాజకీయాలు వర్కవుట్ అవుతాయా.. అన్నది మాత్రం ఆలోచించాల్సిందే…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close