“కేబినెట్” సమీకరణాలతోనే ఎమ్మెల్సీ ఎంపికలా !?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆరుగురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత .. అసలు కేసీఆర్ లెక్కలేంటి ? అన్న చర్చే జరిగింది. ఎందుకంటే రాజ్యసభ సభ్యునిగా ఉండ బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేశారు. నిన్నామొన్నటి వరకు కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. అసలు ఎగ్గొడతారని అనుకున్న కౌశిక్ రెడ్డికి కూడా చాన్సిచ్చారు. అనూహ్యంగా ఇక చాన్స్ లేదనుకున్న కడియం శ్రీహరికీ అవకాశం కల్పించారు. ఈ ఆరుగురి ఎంపిక చూసిన తర్వాత చాలా మంది వీరిలో సగం మందికి ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ ఉంటుందన్న అంచనాకు వస్తున్నారు.

వీరు కాకుండా మరో 12స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ ఖాతాలో పడతాయి. అయితే అవి ఆయా జిల్లా స్థాయి నేతలకే కేసీఆర్ ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మాత్రం పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలతోనే ఎంపిక చేశారని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈటల రాజేందర్ సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్ వర్గీయుల్ని ఆకట్టుకోవడానికి బండా ప్రకాష్‌ను కేబినెట్‌లోకి తీసుకుని డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.

ఇక మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఖరారరయ్యారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ఖచ్చితంగా ఈ ఆలోచనలతోనే ఆయనను ఎమ్మెల్సీ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ హరీష్ వద్ద ఉంది. ఆయనను వైద్య ఆరోగ్య శాఖకు పరిమితం చేసే అవకాశం ఉంది. ఈ ఆరుగురిలో మరొకరికి కేబినెట్ చాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగిస్తారని చెబుతున్నారు. అలాగే ఎన్నికల్లో ఇంచార్జులుగా ఉండి మంచి ఫలితాలు సాధించలేకపోయిన వారినీ తొలగించే అవకాశం ఉంది. గతంలో ఇవే హెచ్చరికలు చేశారు కూడా. ఈ కారణంగానే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే జోరుగా చర్చ ప్రారంభమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close