పెట్రో ధ‌ర‌లు త‌గ్గించేలేమంటున్న మోడీ స‌ర్కారు!

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం సూప‌ర్ హిట్ అయింద‌నీ, దేశంలో ఆదాయ పన్ను రిట‌ర్న్స్ అనూహ్యంగా పెరిగాయ‌నీ, ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణ‌కు వ‌చ్చిందంటూ భాజ‌పా స‌ర్కారు ఈ మధ్య కొత్త ప్ర‌చారానికి తెరలేపిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆదాయం అద్భుతంగా పెరిగింద‌ని చెబుతున్నారుగానీ… పెట్రో ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై మోడీ స‌ర్కారు ఇప్ప‌టికీ దృష్టి మ‌ర‌ల్చ‌డం లేదు. రోజురోజుకీ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. గ‌డ‌చిన ప‌ది రోజుల్లో దాదాపుగా రెండు నుంచి మూడు రూపాయ‌లు ధ‌ర పెరిగింది. ప్ర‌తీరోజూ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు ఉండ‌టంతో, రోజుకి కొన్ని పైస‌ల చొప్పున ఈ వ‌డ్డ‌న జ‌రుగుతోంది. త‌గ్గించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ… అంత‌ర్జాతీయంగా రూపాయి మారకం పెర‌గ‌డం వల్ల‌నే పెట్రో ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తోంద‌న్న వాద‌న‌నే కేంద్రం వినిపిస్తోంది.

న‌రేంద్ర మోడీ ప్ర‌ధానమంత్రి అయిన త‌రువాత పెట్రోల్ మీద రూ. 14 ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. అదే, గ‌త ఎన్డీయే హ‌యాంలో చూసుకుంటే… అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడి చ‌మురు ధ‌ర‌లు ఒక పీపాకి దాదాపు 150 డాల‌ర్ల‌కు వెళ్లిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లీట‌ర్ పెట్రోల్ రూ. 75కి ఉండేది. కానీ, మోడీ అధికారంలోకి వ‌చ్చాక అంత‌ర్జాతీయ ముడి చ‌మురు ధ‌ర‌లు అనూహ్యంగా త‌గ్గిపోయాయి. 50 డాల‌ర్ల‌లోపు ముడిచ‌మురు ల‌భిస్తున్నా, ఆ మేర‌కు డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌ల్ని ప్ర‌భుత్వం తగ్గించే ప్ర‌య‌త్నం చెయ్య‌లేదు. ప్ర‌స్తుతం ఓ 70 డాల‌ర్ల‌కుపైగా ముడి చ‌మురు ధ‌ర ఉంది. పెట్రోల్‌, డీజిల్ పై కేంద్ర ప్ర‌భుత్వం ప‌న్నులు త‌గ్గించుకునే అవ‌కాశం ఉంది. క‌నీసం, ఇది ఎన్నిక‌ల సంవ‌త్స‌రం అయిన‌ప్ప‌టికీ కూడా ఆ దిశ‌గా మోడీ స‌ర్కారు ఆలోచించ‌డం లేదు.

అది చాల‌ద‌న్న‌ట్టుగా… కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ స్పందిస్తూ ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు కార‌ణాలు ప్ర‌జ‌ల‌కు అర్థం కాద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నారు! అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న కొన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల వ‌ల్ల ధ‌ర‌లు పెంచాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. ఇంత‌కీ, ఆ ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏంట‌నేది చెప్ప‌లేదు! గ‌డ‌చిన రెండు వారాలుగా ప్ర‌తీరోజూ పెట్రోల్‌, డీజిల్ పై ఎన్నో కొన్ని పైస‌ల పెంపు జ‌రుగుతూనే ఉంది. డిసెంబ‌ర్ నాటికి లీట‌ర్ పెట్రోల్ రూ. 100కి చేరిపోవ‌డం ఖాయం అన్న‌ట్టుగా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే, పెరుగుతున్న ధ‌ర‌ల‌పై సామాన్యుడు తీవ్ర ఆగ్ర‌హంతో వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. రాబోయే ఎన్నిక‌ల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మోడీ స‌ర్కారపై మ‌రింత పెంచే మ‌రో అంశంగా మార‌డం ఖాయం. నోట్ల ర‌ద్దు సూప‌ర్ హిట్ అయింద‌న్న ప్ర‌చార‌మే పుండు మీద కారంలా ఉంటోంది. ఇప్పుడు, పెట్రో ధ‌ర‌ల‌పై ఇలా మాట్లాడుతూ ఉండ‌టం మ‌రింత ఆగ్ర‌హాన్ని పెంచ‌డ‌మే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close