మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూడా ‘ఇదిగో.. అదిగో’ అనడడం తప్ప, తనయుడి ఎంట్రీని ఖాయం చేయడం లేదు. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా విసిగి వేసారిపోతున్నారు. అసలు మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి ఉందా, లేదా? అనే రేంజ్ లో సాగుతోంది డిబేట్. తాజాగా మోక్షజ్ఞ మరో కథని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
‘బింబిసార’తో ఓ హిట్ తన ఖాతాలో వేసుకొన్న దర్శకుడు వశిష్ట. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ రూపొందించారు. త్వరలోనే రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈలోగా మోక్షజ్ఞకు కూడా ఓ కథ వినిపించార్ట. కానీ మోక్షు రిజెక్ట్ చేసినట్టు టాక్. ఆ ప్రయాణంలో బాలయ్యకు కూడా ఓ కథ వినిపించార్ట. అది ఓకే అయినట్టు తెలుస్తోంది. మోక్షు కోసం వెళ్తే.. బాలయ్య ప్రాజెక్ట్ సెట్ అయ్యిందన్నమాట.
మోక్షుతో సినిమా చేయాలని ఇది వరకు చాలామంది దర్శకులు ప్రయత్నించారు. ప్రశాంత్ వర్మ సినిమా సెట్స్ పైకి వెళ్లేదే. కానీ హఠాత్తుగా ఆగిపోయింది. క్రిష్, బోయపాటి శ్రీను.. ఇలాంటి దర్శకులు కూడా మోక్షుతో సినిమా చేద్దామనుకొన్నారు. కానీ ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. ఇప్పుడు వశిష్ట వంతు వచ్చింది. మరి మోక్షు సినిమాకి క్లాప్ పడేది ఎప్పుడో.
