ధోనీ వర్సెస్ కోహ్లి?

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పోరాటం వన్ డేలకు వచ్చేసింది. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ సిరీస్‌ని కోహ్లి వర్సెస్ ధోనీ అని అభివర్ణిస్తున్నారు. టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతమైన ప్రదర్శన చేశాడు కోహ్లి. కొన్ని సార్లు న్యూజిలాండ్ టీం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఆ మూమెంట్స్‌ని అధిగమించి మరీ గేంని మళ్ళీ భారత్ చేతుల్లోకి తీసుకురావడంలో కోహ్లి సక్సెస్ అయ్యాడు. 3-0తో సిరీస్ గెలిచింది అనగానే అందరూ కూడా ఆట అంతా ఏకపక్షంగా సాగిందని అనుకుంటారు. కానీ బ్లాక్ క్యాప్స్ మాత్రం ఒక్క చివరి టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో తప్ప… పోరాడకుండా చేతులెత్తేసిన సందర్భం ఒక్కటీ లేదు. ఆ చివరి ఇన్నింగ్స్‌కి వచ్చేసరికి మాత్రం మానసికంగా న్యూజిలాండ్ ఆటగాళ్ళు బలహీన పడిపోయారు. గెలవగలం, కనీసం డ్రా చేసుకోగలం, ఎట్‌లీస్ట్ పోరాడగలం అన్న నమ్మకం కూడా న్యూజిలాండర్స్‌కి లేకుండా చేయడంలో కోహ్లి సేన సక్సెస్ అయింది. అందుకే ఏం జరిగితే అదే జరుగుతుంది అనే ఉద్ధేశ్యంతో డిఫెన్స్‌తో క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నాలు మానేసి ఎదురుదాడికి దిగారు. వాళ్ళ వ్యూహాన్ని పసిగట్టిన కోహ్లి పక్కా ప్లానింగ్‌తో న్యూజిలాండ్‌ని చాప చుట్టేశాడు. టీం ఇండియాని నంబర్ ఒన్ బెస్ట్(టెస్ట్) టీంగా సగర్వంగా నిలబెట్టేశాడు.

టెస్ట్ కెప్టెన్ కోహ్లి గ్రాండ్ సక్సెస్ కాస్తా వన్ డే కెప్టెన్ ఎం.ఎస్. ధోనీకి ఆటగాడిగా, కెప్టెన్‌గా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులను క్రియేట్ చేసింది. సీనియర్ ఆటగాళ్ళకు విశ్రాంతినిచ్చామని, సిరీస్ స్టార్ట్ అవకముందే ఫెయిల్యూర్ కారణాలను వెతుకుతున్నారు కానీ అవన్నీ కూడా సాకులుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. మొదటి టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు రోజు టీం ఇండియా ప్రధాన బౌలర్ ఇశాంత్ శర్మ జ్వరంతో టీంకి దూరమయ్యాడు. ఆ తర్వాత కూడా పూజారా, రాహుల్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, షమి….ఇలా చాలా మంది ప్రధాన ఆటగాళ్ళే టెస్ట్ టీంకి దూరమవుతూ ఉన్నారు. అయినప్పటికీ టీంపైన…ఫైనల్‌గా గేంపైన ఆ ప్రభావం పడకుండా కోహ్లి చేయగలిగాడు. ఇప్పుడు ధోనీ కూడా కోహ్లిని ఫాలో అవ్వాల్సిందే. టీమ్స్‌గా చూస్తే రెండు జట్లూ సమానంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం టీం ఇండియాకు అడ్వాంటేజ్. వన్ డే సిరీస్ మొత్తం కూడా సమాన ప్రత్యర్థుల మధ్య హోరా హోరీగా జరిగడం ఖాయం. ఇలాంటి టైంలోనే నాయకుడి వ్యూహాలు, నాయకుడి బలం విన్నర్‌ని డిసైడ్ చేస్తాయి. అసలే పొట్టి క్రికెట్ పగ్గాలు కూడా కోహ్లికి ఇవ్వాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న టైం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వన్ డే సిరీస్‌ని న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా అని పిలవడం కంటే కూడా కోహ్లి వర్సెస్ ధోనీ అని అభివర్ణించొచ్చేమో. ఎన్నో గేమ్స్‌లో ఇండియాని విజయవంతంగా ముందుకు నడిపించిన సీనియర్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ పెర్ఫార్మెన్స్ ఈ సారి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close