నాగచైతన్య షాకింగ్ లుక్

రేపు (23) అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా చైతు కొత్త సినిమా లుక్ బయటికి వచ్చింది. కార్తికేయ‌ సినిమాతో వెలుగులోకి వచ్చాడు చందూ మొండేటి. తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి అప్లాజ్ వ‌చ్చింది. చందూకి నాగ‌చైత‌న్యతో క‌ల‌సి సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించింది. అలా ప్రేమమ్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రేమమ్ సినిమాతో తనకు హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో ఇపుడు సవ్యసాచి సినిమా చేస్తున్నాడు చైతు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. రేపు చైతు బర్త్ డే కానుకగా ఈ సినిమా నుండిమరో పోస్టర్ విడుదల చేశారు. జనరల్ గా చైతు బర్త్ డే లుక్ అంటే క్యూట్ గా వుండే పిక్ ఒకటి రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ చాలా సీరియస్ లుక్ ను వదిలారు. తీక్షణమైన చూపు చాలా సీరియస్ గా వుండే లుక్ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. సీనియర్ హీరో మాధవన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

యుద్ధం శరణం అంటూ ఇటీవలే ఒక యాక్షన్ ఎంటర్ ట్రైనర్ చేశాడు చైతు. ఈ సినిమా నిరాశ పరిచింది. సవ్యసాచి కూడా ఒక డిఫరెంట్ యాక్షన్ ఓరియంటెండ్ సినిమానే. ఒక యాక్షన్ ఇంటర్ ట్రైనర్ లో హిట్ కొట్టాలని చైతు చాన్నాళ్లుగా ఉవ్విల్లూరుతున్నాడు. మరి ఆ కోరిక సవ్యసాచితో తీరుతుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.