అఖిల్ వ‌ల్ల రాత్రిళ్లు నిద్ర‌పోలేద‌ట‌

త‌న తొలి చిత్రం అఖిల్ సినిమా దెబ్బ‌.. అఖిల్‌కి ఎంత త‌గిలిందో.. నితిన్‌కీ అంతే త‌గిలింది. టాప్ ప్రొడ్యూస‌ర్స్ అఖిల్ డెబ్యూ మూవీని తీయాల‌ని ప్లాన్ చేస్తే ఆ ఛాన్స్ నితిన్ చేతికి చిక్కింది. త‌న వంతుగా ఓ మంచి సినిమాని తీయాల‌ని, స్నేహితుడికి ఓ హిట్ ఇవ్వాల‌ని నితిన్ కూడా ప్ర‌య‌త్నించాడు. కానీ… అఖిల్ డిజాస్ట‌ర్‌తో నితిన్‌కీ గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ సినిమా ఆర్థికంగా చేసిన న‌ష్టం కంటే, మాన‌సికంగా ఇచ్చిన షాకే ఎక్కువ‌ని చెబుతున్నాడు నితిన్‌. ఆ ఫ్లాప్ నుంచి తేరుకోవ‌డానికి చాలాకాలం ప‌ట్టింద‌ట‌. అఖిల్ ఫ్లాప్ అయిన రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రాత్రిళ్లు నిద్ర‌కూడా పోలేద‌ట‌.

కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. డ‌బ్బులు పోతాయి. కానీ అఖిల్ ఇచ్చిన స్ట్రోక్ వేరు.. అంటున్నాడు నితిన్‌. స్నేహితుడికి హిట్ సినిమా ఇవ్వ‌లేక‌పోయాన్న బాధ త‌న‌ని ఇంకా వెంటాడుతూనే ఉంద‌ట‌. అయితే ఆ ఫ్లాప్ వ‌ల్ల త‌మ స్నేహానికి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేద‌ని, ఇప్ప‌టికీ తాము మంచి ఫ్రెండ్స‌ని చెబుతున్నాడు నితిన్‌. మ‌రి స్నేహితుడు కోసం నితిన్ మ‌ళ్లీ నిర్మాత‌గా అవ‌తారం ఎత్తి.. ఈ లోటుని భ‌ర్తీ చేస్తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close