షాకింగ్ : శ‌ర్వా, నిత్య‌లు మోసం చేశారు

తమిళ ద‌ర్శ‌కుడు చేర‌న్ శ‌ర్వానంద్‌, నిత్యామీన‌న్‌ల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశాడు. ‘మిమ్మ‌ల్ని న‌మ్మి కోట్లు పెట్టి సినిమా తీస్తే… ప్ర‌మోష‌న్ల‌కు రారా?’ అంటూ ప్రశ్నించాడు. ఇది సంస్కార హీన‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించాడు. ఇటీవ‌ల శ‌ర్వా, నిత్య నటించిన రాజాధిరాజా సినిమా విడుద‌లైంది. దీనికి చేర‌న్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు శ‌ర్వానంద్‌, నిత్య‌లు హ్యాండిచ్చారు. దాంతో చేర‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు, చెన్నైలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వీరిద్ద‌రిపై చేర‌న్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇండ్ర‌స్ట్రీకి షాక్ ఇచ్చింది.

”శ‌ర్వాని నేను సొంత త‌మ్ముడిలా చూసుకొన్నా. అత‌నికి మార్కెట్ లేన‌ప్పుడు పిలిచి అవ‌కాశం ఇచ్చా. ముందు కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తానని చెప్పాను. కానీ 55 ల‌క్ష‌లే ఇవ్వ‌గ‌లిగాను. ఆ మిగిలిన సొమ్ము ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మే. ఆ విష‌యా మాట్లాడామ‌ని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. చివ‌రికి ప్ర‌మోష‌న్లు లేకుండానే ఈ సినిమాని విడుద‌ల చేయాల్సివచ్చింది. నిత్య కూడా ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు. హీరో వ‌స్తేనే వ‌స్తా.. అని చెప్పింది. శ‌ర్వా ప్ర‌మోష‌న్ల‌కు రాక‌పోవ‌డ‌మే కాదు.. ఈ సినిమాపై నెగిటీవ్ ప్ర‌చారం చేస్తున్నాడ‌ని తెలిసింది. మంచి న‌టుడే. కానీ.. తాను ఇలా ప్ర‌వ‌ర్తించి ఉండ‌కూడ‌దు. మిమ్మ‌ల్ని న‌మ్మి సినిమా తీస్తే నిర్మాతల్ని ముంచ‌డం భావ్యం కాదు” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు. మ‌రి.. శ‌ర్వా, నిత్య‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close