కీల‌క స‌మావేశంలో ఈటెల ఎందుకు క‌నిపించ‌లేదు..?

రాబోయే 30 రోజుల్లో పంచాయ‌తీల రూపురేఖ‌లు మార్చేద్దామంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీని కోసం ఏర్పాటు చేసిన స‌మావేశం ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారులు, మంత్రులు స‌హ‌జంగానే ఈ కార్య‌క్ర‌మంలో ఉండాలి. కానీ, నిన్న జ‌రిగిన స‌మావేశంలో ముగ్గురు కీల‌క మంత్రులు క‌నిపించ‌లేదు. వారిలో ఇద్ద‌రు మంత్రులు ఈ స‌మావేశానికి రాక‌పోవ‌డానికి వేర్వేరు కార‌ణాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. కానీ, మంత్రి ఈటెల రాజేంద‌ర్ హైద‌రాబాద్ లో ఉండి కూడా ఈ యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌ట‌న‌లో ఎందుకు క‌నిపించ‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌..?

మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కుటుంబ స‌మేతంగా తిరుప‌తి వెళ్లారు, కాబ‌ట్టి ఆయ‌న ఈ స‌మావేశానికి రాలేక‌పోయారు. మ‌రోమంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సూర్యాపేట‌లో పార్టీకి సంబంధించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనడానికి వెళ్లాల్సి వ‌చ్చింది, కాబ‌ట్టి ఆయ‌నా హాజ‌రు కాలేదు. ఇద్ద‌రూ న‌గ‌రంలో లేరు కాబ‌ట్టి రాలేదు! ఇక‌, మ‌రో మంత్రి ఈటెల రాజేంద‌ర్… హైద‌రాబాద్ లోనే ఉన్నారు, కానీ సీఎం నిర్వ‌హించిన స‌మీక్ష‌కు హ‌జ‌రు కాలేదు. రోజంతా ఏం చేశారంటే… ఉద‌యం 11కే ఫీవ‌ర్ హాస్పిట‌ల్ కి వెళ్లారు, ఆ త‌రువాత కోటీ వైద్య విధాన ప‌రిష‌త్ కి వెళ్లారు. అక్క‌డి నుంచీ సీఎం స‌మీక్ష స‌మావేశానికే ఆయ‌న వెళ్తార‌ని అనుకున్నారు.. కానీ, ఆయ‌న రాలేదు! ఇంత‌కీ, ఆయ‌న్ని పిలిచారా అంటే.. సీఎం పేషీ నుంచి ఎలాంటి ఫోన్లు ఆయ‌న‌కి రాలేద‌ని అంటున్నారు. ఫోన్ వ‌స్తే బ‌య‌ల్దేర‌దామ‌నే ఉద్దేశంతోనే చేతిలో మొబైల్ ప‌ట్టుకుని సాయంత్రం వ‌ర‌కూ ఈటెల ఎదురుచూశారంటూ ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. సాధార‌ణంగా, ఇలాంటి కీల‌క స‌మావేశాలుంటే సీఎం కార్యాల‌యం నుంచి అధికారులు, మంత్రుల‌కు ఫోన్లు వెళ్తాయి. కానీ, ఈటెల‌కి ఎలాంటి ఫోన్లూ రాలేద‌ట‌!

ఇంకో విష‌యం ఏంటంటే… 30 రోజుల యాక్ష‌న్ ప్లాన్ ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మానికి ఏ మంత్రికీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి రావాలంటూ ఫోన్లు వెళ్ల‌లేద‌ట‌! కానీ, అధికారుల‌తోపాటు మంత్రుల్ని కూడా పిలుస్తామంటూ సీఎంవో నోట్ లో ఉంద‌ట‌! అలాంట‌ప్పుడు సీఎం కార్యాల‌యం పిల‌వాలి క‌దా అంటే… ఏమో, ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి మంత్రుల‌కు ఆహ్వానాలు వెళ్లాయేమో అంటూ సీఎం వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. నిజానికి, ఇది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం అయిన‌ప్పుడు మంత్రుల్ని, అధికారుల్నీ పిల‌వాల్సిన బాధ్య‌త సీఎంవోదే క‌దా. స‌రే, ఈ స‌మ‌న్వ‌య లోపం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే… మంత్రి ఈటెల రాజేంద‌ర్ న‌గ‌రంలో అందుబాటు ఉండి కూడా ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి వెళ్ల‌క‌పోవ‌డం కొంత చ‌ర్చ‌నీయంగానే మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close