పోలవరం రాజీ తప్ప అంతా మామూలే!

ఢిల్లీలో ప్రధాని మోడీతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంపై ఎక్కువ ఆశలు వద్దని నిన్ననే చెప్పుకున్నాం. వారిద్దరి మధ్య రాజకీయ అవసరాలు వారిద్దరినీ భేటీలో కూచోబెట్టి వుండొచ్చు తప్ప కేంద్రం వైపు నుంచి అంగుళమైనా అడుగు కదిలింది లేదు. వురు విల్‌ డూ ద బెస్ట్‌ అనే రొటీన్‌ డైలాగ్‌ తప్ప ప్రధాని నోట మరో నిర్దిష్టమైన లేదా కనీసం దృఢమైన హామీ రాలేదని మీడియా గోష్టిలోచంద్రబాబు మాటలు, శరీర భాష కూడా చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఇచ్చిన హామీల మేరకు అందిన సహాయం కూడా లేదని చెప్పేశారు. ఎంతగానో పొగిడిన ప్యాకేజి కింద 16వేల కోటు ్ల రావలసి వుంటే కేవలం 3780 కోట్టు మాత్రమే రావడం ఇందుకో ఉదాహరణ. రెవెన్యూ లోటు మొత్తం ఇవ్వడం అటుంచి అయిదో ఏడు వస్తున్నా అసలు లెక్క తేలలేదట. షెడ్యూలు 13 కింద ఇచ్చామని అదేపనిగా చెప్పే సంస్థలు 9కి 11 వేల కోట్లు అవసరం కాగా ఇప్పటికి కేటాయించింది 480 కోట్లు! ఇంకో రెండు మొదలే కాలేదు. రాజధాని నిర్మాణానికి నేరుగాఇచ్చింది 3000 కోట్టు మాత్రమే. విజయవాడ గుంటూరు డ్రైనేజికి ఇచ్చిన వెయ్యి కోట్లు కలిపినా 4 వేలే. కాని హరిత రాజదాని నిర్మాణానికి చాలా కావాలని ముఖ్యమంత్రి మనవి. పోలవరం విషయంలోనూ ఇవ్వాల్సింది ఇంకా దాదాపు 4 వేల కోట్లు వుంది. మూడు మాసాలు పనులు ఆగిపోవడం వల్ల 2018కి నీరిచ్చే ప్రతిపాదన కూడా సందేహంలో పడింది. ట్రాన్స్‌ట్రారు స్థానంలో కొత్త కాంట్రాక్టరును పిలవడానికి మరో వారం సమయం తీసుకుంటారు. 2019కి ఒకేసారి పూర్తి చేస్తే మంచిదేమో ఆలోచిస్తారు. ఈ మాటలలో ధ్వనించే అర్థం స్పష్టమే. ఇవన్నీ నిర్మాణానికి సంబంధించినవి కాగా భూ సేకరణ, పునరావాసంపై ఎలాటి కేటాయింపులు లేవు. ఎప్పటిలాగే చేస్తానని చెప్పడం తప్ప ఇదమిద్దంగా కాలవ్యవధితో హామీ కూడా రాలేదు. అయినా మనం నమ్మకంతో వుండాలని అదే కాపాడుతుందని చంద్రబాబు చెప్పిన మాటలు వేదాంతాన్ని ధ్వనిస్తున్నాయి.బిజెపి నేతల విమర్శలు కేంద్రం ఆటంకాలకు సంబంధించిన అంశాలపై ఆయన రాజకీయాల్దంటూ దాటేశారు. పోలవరంపై ఇద్దరూ కొంత సర్దుకుని ఒక అవగాహనకు రావడం వల్లనే ఈ సమావేశం జరిగిందని అర్థమవుతుంది. వారి సర్దుబాటుకు రాష్ట్రం చెల్లించే మూల్యం ఏమిటో ముందు ముందు తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వం తప్పిదాలను వైసీపీ నేత జగన్‌ను విమర్శించేందుకు ఉపయోగించిన తీవ్రభాషతో పోలిస్తే మోడీ సర్కారు జాప్యం సహాయ నిరాకరణ వంటివాటిని ప్రస్తావించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధపడలేదు.

సర్వీసు రంగంలోనూ ఆదాయంలోనూ తెలంగాణకన్నా వెనకబడి వున్నట్టు దక్షిణాదిలోనే ఆఖరున వున్నట్టు ఆయన చెప్పడం రాజకీయంగా ప్రజలను సిద్ధం చేయడానికి ఉద్దేశించిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close