‘మ‌నం’ ద‌ర్శ‌కుడితో ఎన్టీఆర్‌??

13 బి, ఇష్క్, మ‌నం, 24 ఇలా వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌తో మెప్పిస్తున్నాడు విక్ర‌మ్ కె.కుమార్‌. త‌న క‌థ‌లు, వాటిని తెర‌పై ఆవిష్క‌రించే విధానం కొత్త‌గా ఉంటున్నాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు అందుకొంటున్నాయి. అందుకే… చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. ప్ర‌స్తుతం అఖిల్‌తో ‘హ‌లో’ తెర‌కెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్‌తో ఆల్రెడీ ఓ క‌మిట్‌మెంట్ ఉంది విక్ర‌మ్‌కి. ఇప్పుడు ఎన్టీఆర్‌కీ మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ – విక్ర‌మ్ కె.కుమార్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొనే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఓ అగ్ర నిర్మాత విక్ర‌మ్ .కె కుమార్‌ని క‌లిసి ఎన్టీఆర్‌కి త‌గిన క‌థ‌ని సిద్దం చేయ‌మ‌ని అడిగిన‌ట్టు స‌మాచారం. అందుకు విక్ర‌మ్ కూడా ఓకే అనేశాడ‌ట‌. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్క‌బోతోంద‌ని స‌మాచారం. ‘జై ల‌వ‌కుశ’ త‌ర‌వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు తార‌క్‌. ఈలోగా మ‌రో సినిమా చేసే ఆలోచ‌న కూడా ఉంది. అన్నీ కుదిరితే విక్ర‌మ్ కె.కుమార్ సినిమా 2018 చివ‌ర్లోనే, 2019 ప్రారంభంలోనో ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close