ఎన్టీఆర్ వ‌రం ఇచ్చేశాడు

ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నాడు ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ. ఎన్టీఆర్ సినిమాల‌కు క‌థ‌లు అందించిన వ‌క్కంతం.. ఎన్టీఆర్ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా లాంఛ్ అవుదామ‌నుకొన్నాడు. టెంప‌ర్‌.. వ‌క్కంతం క‌థే. పూరి జ‌గ‌న్నాధ్ కోసం త్యాగం చేయాల్సివ‌చ్చింది. `నీతో ఎప్ప‌టికైనా సినిమా చేస్తా` అని ఎన్టీఆర్ కూడా వ‌క్కంతంకి మాట ఇచ్చాడు, అందుకే ఈమ‌ధ్య ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా వక్కంతం చేయ‌లేదు. ఈ సినిమాని నిర్మించ‌డానికి క‌ల్యాణ్ రామ్ కూడా ముందుకొచ్చాడు. ఇప్పుడు వ‌క్కంతం నిరీక్ష‌ణ ఫ‌లించింది. జ‌న‌తా గ్యారేజీ త‌ర‌వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమా వ‌క్కంతంతోనే అన్న‌ది ఫిక్స‌య్యింది.

జ‌న‌తా గ్యారేజీ ఎన్టీఆర్ 26వ చిత్రం. 27వ సినిమాని వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ కూడా ఇంటర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డానికి పూరి మళ్లీ రెడీగా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం వ‌క్కంతంకే ఛాన్స్ ఇచ్చాడు. ఇంత‌కాలం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న వ‌క్కంతం వంశీకి ఇది నిజంగా వ‌రం లాంటి వార్తే. ఈ యేడాది ఆగ‌స్టులో ఈ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close