ఎన్నిక‌ల సంఘం నుంచి మోడీకి మ‌రో క్లీన్ చిట్‌..!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తొమ్మిదో క్లీన్ చిట్ ల‌భించింది..! అదేనండీ… కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చింది. మోడీకి మీద ఈసీకి ఫిర్యాదులు అంద‌డ‌మే ఆల‌స్యం… వెంట‌నే క్లీన్ చిట్ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోతోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు త‌గ్గట్టుగానే ప‌రిస్థితి ఉంది. మాజీ ప్ర‌ధాని స్వ‌ర్గీయ రాజీవ్ గాంధీని ఉద్దేశించి మోడీ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈసీ స్పందించి, క్లీన్ చిట్ ఇచ్చేసింది. శ‌నివారం నాడు యూపీలోని ప్ర‌తాప్ గ‌ఢ్ లో మోడీ మాట్లాడుతూ… మీ నాన్న (రాజీవ్ గాంధీ)ని మిస్ట‌ర్ క్లీన్ అని చుట్టూ ఉన్న‌వారు మాత్ర‌మే పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తార‌నీ, కానీ ఆయ‌న జీవితం బ్ర‌ష్టాచారీ నంబ‌ర్ 1 గానే ముసిగింద‌ని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ సీరియ‌స్ గా తీసుకుని, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ… మోడీ చేసిన వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కిందికి రావ‌ని స్ప‌ష్టం తేల్చి చెప్పేసింది. మోడీ కోడ్ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డ‌ట్టు కాద‌నీ, కాబ‌ట్టి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం లేద‌ని కాంగ్రెస్ పార్టీకి స్ప‌ష్టం చేసింది. దీంతో క‌లిపి ఇంత‌వ‌ర‌కూ మోడీకి ఈసీ ఇచ్చిన క్లీన్ చిట్ ల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. అయితే, ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డితో వ‌దిలేట్టుగా క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధాన‌మంత్రి మోడీపై చేస్తున్న ఫిర్యాదుల మీద ఎన్నిక‌ల సంఘం స‌రిగా స్పందించ‌డం లేద‌నీ, పార‌ద‌ర్శంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదంటూ సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు పార్టీ ఎంపీ సుష్మితా దేవ్ సుప్రీం కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. కోర్టుకు కాంగ్రెస్ వెళ్లిన కొన్ని గంట‌ల్లోనే మ‌రోసారి ఈసీ స్పందించ‌డం… మోడీ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేదంటూ స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

ఈ ఎన్నిక‌ల్లో ఎన్నిల సంఘం తీరుపై కూడా స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇస్తోంది. మోడీ హ‌యాంలో రాజ్యాంగబ‌ద్ధ‌మైన స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఒక్కోటిగా విశ్వాసాన్ని కోల్పోతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు చాలా వ‌చ్చాయి. ఇప్పుడు ఈసీ కూడా ప్ర‌ధానిపై అందే ఫిర్యాదుల‌కు ఒక‌లా, ఇత‌రుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల విష‌యంలో మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న సందేహాలు సామాన్య ప్ర‌జ‌ల్లోకి సైతం వెళ్తున్నాయి. భాజ‌పాయేత‌ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నిక‌ల కోడ్ పేరుతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. మ‌రి, ప్ర‌ధాని విష‌యంలో ఈసీ స్పందిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close