టీజీకి కాదు పవన్.. టీడీపీకి కౌంటర్ ఇవ్వాలి..!

మార్చిలో జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలంటూ ప్రకటించిన… తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ కు..పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పాడేరులో.. ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్… టీజీ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదనన్నారు. జనసేన వద్దనుకుంటే టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తు చేశారు. టీజీ వెంకటేష్‌…పెద్దమనిషిగా మాట్లాడు లేదంటే తాను నోరు అదుపు తప్పి మాట్లాడుతానని హెచ్చరించారు. నేను నోరు విప్పితే మీరు ఏమవుతారో ఆలోచించుకోవాలన్నారు. కిడారి, సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణం సభలో పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

మరో వైపు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై… చంద్రబాబు కూడా మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదన్నారు. ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని మండిపడ్డారు. పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు… నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే.. ఎవరికీ మంచిది కాదన్నారు. కొద్ది రోజులుగా.. టీడీపీ నేతలు పవన్ కలసి రావాలని ప్రకటనలు చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా.. టీజీ వెంకటేష్.. పొత్తు పెట్టేసుకున్నట్లుగా ప్రకటించారు. దాంతో వివాదం ప్రారంభమయింది.

జనసేన.. తాము కమ్యూనిస్టులతో మాత్రమే పొత్తులు పెట్టుకుంటామని ప్రకటించింది. గతంలోపవన్ కల్యాణ్ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ నేరుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. పాడేరులో జరిగిన బహిరంగసభలో.. టీజీ వెంకటేష్ పై పవన్ కల్యాణ్ మండి పడ్డారు కానీ.. పొత్తుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీతో కలిసి పని చేసే ప్రశ్నే లేదని ప్రకటన చేసి ఉండే కాస్త క్లారిటీ ఉండేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కానీ.. పవన్ ఆ మాట మాత్రం చెప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close