పవర్ స్టార్ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం..?

ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది రెండో అవకాశాన్నే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని దర్శకత్వం వహించి రచ్చ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్ తో పవర్ స్టార్ సర్ధార్ సినిమాకు దర్శకత్వం అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాడు. అయితే ఆ కసి మీదే రవితేజతో బెంగాల్ టైగర్ తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు లేండి. సినిమా లాభ నష్టాలు పక్కనపెడితే సంపత్ నందిని నమ్ముకుంటే హీరో ఇమేజ్ కి ఎటువంటి భంగం కలుగదు అని మరోసారి సత్తా చాటాడు.

బెంగాల్ టైగర్ హిట్ తో సంపత్ దర్శకత్వ ప్రతిభను చూసి అందరు మెచ్చుకుంటున్నారు. ఈ దారిలో దాసరి నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీయబోయే సినిమాకు సంపత్ నందిని దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. పవర్ స్టార్ కాదు పొమ్మన్నా బెంగాల్ టైగర్ లో తనకు పవన్ మీద ఉన్న అభిమానాన్ని చెప్పకనే చెప్పాడు సంపత్. అయితే ఈసారి పవన్ సినిమా వస్తే అసలు వదులుకునేదే లేదని ముందునుండి చెబుతూనే వస్తున్నాడు.

అనుకున్నట్టుగానే పవన్ జపం చేస్తున్న సంపత్ కు దాసరి నుండి పిలుపువచ్చిందట. కథ.. కథనాలు.. దాసరి, పవన్ పర్యవేక్షణ చేస్తుండగా సంపత్ నంది కేవలం దర్శకత్వం చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. అయితే సంపత్ ఈ అద్భుత అవకాశం నిజంగానే ఇంత త్వరగా వస్తుందని ఊహించి ఉండడు. దాసరి, పవన్, సంపత్ సినిమా విషయాలు సంక్రాంతికి వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close