టీడీపీతో పొత్తుపై తప్పుగా మాట్లాడితే కోవర్టులే : పవన్ కల్యాణ్

జనసేన – టీడీపీ పొత్తులపై ఏ నాయకుడు కార్యకర్తలు తప్పుగా బయట గానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడినా వారిని వైసీపీ కోవర్టులుగా చూడాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ మాట్లాడారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన కలవటంపై వైసీపీ విమర్శలు చేస్తోందని తాను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. దీని వెనుక వ్యూహాలు ఉంటాయన్నారు. అసలు తమ పొత్తులపై ఈ మాట అనటానికి వైసీపీకి అర్హత లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామంటే అది ప్రజల మంచి కోసమేనని స్ఫష్టం చేశారు. దీనిపై విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీని సమర్థంగా ఎదుర్కోవడానికే రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిశాయని స్పష్టం చేశారు.

పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేక మంది బెదిరించారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని వారికి చెప్పా. మేము టీడీపీ వెనుక నడవడం లేదు. ఆ పార్టీతో కలిసి నడుస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. జనసేనకు యువతే పెద్ద బలమన్నారు. మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఏపీలో జనసేనకు నేడు ఆరున్నర లక్షల కేడర్‌ ఉందన్నారు. ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదని.. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారని చెప్పారు. తనను తన భావజాలాన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు.. యువత ఆదరణ చూసి తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని స్పష్టం చేశారు. నా సినిమాలు ఆపేసినా, నేను బస చేసిన హోటల్ వద్దకు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా నేను ఏనాడూ జాతీయ నేతల వద్దకు వెళ్లి వారి సహాయం అడగలేదు.’ అని పవన్ స్పష్టం చేశారు.

‘మన బలం చూపించకపోతే గుర్తింపు ఇవ్వరు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది.’ అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందన్నారు. వైసీపీ అసలు భావజాలం లేని పార్టీ అని.. సమాజాన్ని ఎలా చూస్తామనే అంశంపై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నేను మొదటి నుంచీ పదవులు కోరుకోలేదని. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కూ ఓ వ్యుహకర్త అవసరమే..!!

ఎన్నికల వ్యుహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకొని తర్వాత వదిలేసుకున్న బీఆర్ఎస్ కు ఆ అవసరం ఏపాటిదో క్రమంగా అర్థం అవుతోంది. వ్యుహకర్తగా అపాయింట్ చేసుకున్న సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్...

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close