ఇప్పుడు చింతిస్తే ఏం లాభం పాయ‌ల్‌??

‘ఆర్‌.ఎక్స్ 100’ మిన‌హా మ‌రో విజ‌యాన్ని రుచి చూడ‌లేక‌పోయింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. వ‌చ్చిన స్టార్ డ‌మ్ ని, అవ‌కాశాల్నీ చేజేతులా పాడుచేసుకుంది. ఇది ముమ్మాటికీ త‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే. వెంక‌టేష్‌, ర‌వితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసినా – త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు రాక‌పోవ‌డంతో పాయ‌ల్ ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. `త‌ప్పంతా నాదే..` అంటూ ఆత్మ విమ‌ర్శ చేసుకుంటూనే – ఈ విష‌యంలో ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా త‌న‌ని త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని నిందిస్తోంది.

త‌న త‌ప్పుడు నిర్ణ‌యాల్లో ‘వెంకీ మామ‌’ కూడా ఉంద‌ని ఇటీవ‌ల మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. వెంకీ మామ‌లో వెంక‌టేష్‌కి జోడీగా న‌టించింది పాయ‌ల్. అందులో టీచ‌ర్‌గా క‌నిపించింది. గ్లామ‌ర్ డోసు ఎక్కువైనా స‌రే – పాయ‌ల్ కి ఈ సినిమా ఎలాంటి బ్రేకూ ఇవ్వ‌లేక‌పోయింది. ”ఈ సినిమాలో నేను మ‌రీ ఆంటీలా క‌నిపించాను. అది నా అవ‌కాశాల్ని దెబ్బ‌తీసింది. యువ క‌థానాయ‌కుల ప‌క్క‌న అవ‌కాశాలు రానివ్వ‌కుండా చేసింది” అంటూ తెగ ఫీలైపోతోంది పాయ‌ల్‌. `వెంకీ మామ‌` త‌ర‌వాత పాయ‌ల్ కి కొత్త‌గా అవ‌కాశాలేం రావ‌డం లేదు. బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబోలో రూపొందుతున్న చిత్రంలో పాయ‌ల్‌కి ఛాన్సొచ్చినా – ఏవేవో కార‌ణాలు చెప్పి త‌ప్పుకుంద‌ని స‌మాచారం. సీరియ‌ర్ హీరోల‌తో న‌టిస్తే.. యూత్ హీరోలు ప‌ట్టించుకోర‌ని బాగా భ‌య‌ప‌డి ఉంటుంది. ఇప్పుడు ఆ యూత్ హీరోలు సైతం పాయ‌ల్‌ని లైట్ తీసుకున్నారుగా. అటు సీనియ‌ర్ హీరోల సినిమాలూ చేయ‌క‌, ఇటు యువ హీరోలూ అవ‌కాశాలు ఇవ్వ‌క‌.. పాపం పాయ‌ల్‌. గ‌ట్టెక్కేది ఎలా..? అయినా అంతా అయిపోయాక‌, ఇప్పుడు చింతిస్తే ఏం లాభం? సినిమాలు ఒప్పుకునే ముందే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల్సింది. ఇట్స్ టూ లేట్‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close