పంచిన డబ్బులన్నీ బంగారమాయేగా..!

బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ కారణమే కాదు.. గత కొన్ని రోజులుగా… బంగారం దుకాణాల వద్ద అదే రద్దీ. రెండేళ్లతో పోలిస్తే… డిమాండ్ అమాంతం పెరిగిందని.. అదీ కూడా… ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాతేనని… వ్యాపారులు సంతోషపడుతున్నారు. అయితే.. ఈ కొనుగోళ్లన్నీ… తేలికపాటి నగలే. పేద, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా కొనుగోళ్లకు వస్తున్నారు. ఇలా కొనుగోళ్లకు వాడుతున్న నగదులో… యాభై నుంచి అరవై శాతం… రాజకీయ పార్టీలు.. ఓట్ల కొనుగోళ్లకు ప్రజలకు పంచిన డబ్బులే.

ఈ సారి బంగారాన్ని తెగ కొనేస్తున్నారు..!

రెండేళ్లుగా బంగారం వ్యాపారం డల్‌గా ఉంది. కానీ ఈ ఏడాది ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా దక్షిణాదిలో.. బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. రూ. లక్ష లోపు ఖరీదు చేసే ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి జీవులు దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. రెండేళ్లుగా దాచుకున్న డబ్బులతో వీరు.. నగదు కొనుగోలు చేయడం లేదు. ఎన్నికల సందర్భంగా.. అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా పోటీపడి పంచిన డబ్బులను.. వృధా చేసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో.. బంగారంలో మదుపు చేసుకుంటున్నారు. తమ మధ్యతరగతి జీవితాల్లో… తీరని.. చిన్న చిన్న నగల కోరికల్ని తీర్చుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కన్నా…దక్షిణాది రాష్ట్రాల్లోనే రాజకీయాల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ. అదే ఇప్పుడు… బంగారం కొనుగోళ్లలోనూ కనిపిస్తోంది. ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలోబంగారం కొనుగోళ్లు… 30 శాతం వరకూ ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.

గోల్డ్ షాపులకు రాజకీయ పార్టీలు పంచిన రూ. వేల కోట్లు ..!

ఆంధ్రప్రదేశ్‌లో రూ.పది వేల కోట్లు డబ్బు పంచారని… జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు చెబితే… ఆయనపై విరుచుకుపడ్డారు. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. ఆయన మాటను ఎవరూ కాదనలేదు. ఏపీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పెట్టిన ఖర్చు.. రాజకీయ పార్టీలు సొంతంగా పెట్టిన ఖర్చు.. ఇలా.. ఏ విధంగా చూసినా… రూ. పది వేల కోట్లకుపైమాటే. ఇక దేశంలో ఈ స్థాయిలో నగదు ప్రవాహం ఉందో లేదో కానీ.. డబ్బులేనిదే ఇప్పుడు రాజకీయాలు నడవడం లేదు. భారతదేశంలో ఎన్నికలంటే… ఓట్ల కొనుగోలు. ఓటింగ్ ముందు రోజు నేరుగా కొనుగోలు చేస్తారు. అంతకు ముందు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల రూపంలో కొనుగోలు చేస్తాయి. అంతా … డబ్బే..డబ్బు. డబ్బు లేనిదే ప్రజాస్వామ్యం నడవడం లేదు. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బు చేరుతోంది. ప్రభుత్వం అధికారికంగా సంక్షేమ పథకాల రూపంలో … ఒక్కో మహిళ వద్దకు రూ. పదివేలు చేర్చగా… ఇక రాజకీయ పార్టీలు ఓట్ల కొనుగోలు కోసం… నలుగురు ఓటర్లున్న కుటుంబానికి… మరో రూ. పది నుంచి పదిహేను వేలు చేర్చారు. ఫలితంగా.. పేద, మధ్యతరగతి ప్రజలకు.. నిజంగానే ఓట్ల పండుగ అయింది. అలా వచ్చిన నగదును.. ఎక్కువగా మహిళలు.. బంగారం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు.

ఐదేళ్ల బ్లాక్‌మనీ ఒక్క సారికే ప్రజలకు చేరుతోందా..?

రాజకీయ పార్టీలు పంచినా… ప్రభుత్వాలు ఇచ్చినా.. అదేమీ వారి సొంత ఆస్తి కాదు. ప్రభుత్వానిదే. అంటే ప్రజలదే. ఇలా పంచడం వల్ల… పునరుత్పాదక కార్యక్రమాలకు వెచ్చించాల్సిన వందలు, వేల కోట్ల సొమ్ము… నిరుపయోగం అవుతుందన్న అంశంపై రాజకీయ పార్టీలకు పట్టింపు లేదు. ప్రభుత్వ పరంగా ఇచ్చే సొమ్ముకే ఇది వర్తిస్తుంది. రాజకీయ పార్టీలు.. నేతలు అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును.. పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో పంచి పెడతున్నారు. ఇది ఓ రకంగా మంచిదే. నిగూఢంగా.. బ్లాక్‌గా మారిపోయిన అవినీతి సొమ్ము ఎన్నికల సమయంలో… వైట్‌గా ప్రజల వద్దకు చేరుతుంది. అందులో సగం చివరికి బంగారం రూపంలో.. ప్రజల వద్ద స్టోర్ అవుతోందని… అమ్మకాలను బట్టి తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close