‘సాహో’కి మ‌రింత హైప్ అవ‌స‌ర‌మా?

‘బాహుబ‌లి’ త‌ర‌వాత ప్ర‌భాస్ సినిమా అంటేనే స‌హ‌జంగానే… అందరి దృష్టీ అటువైపు పడుతుంది. ఆ సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే బిజినెస్ పూర్త‌యిపోతుంది. ద‌ర్శకుడెవ‌రైనా నిర్మాత‌ల‌కు కోట్ల టేబుల్ ప్రాఫిట్ ద‌క్కుతుంది. ప్ర‌భాస్ సినిమా అనే ట్యాగ్ లైన్ చాలు. మ‌రే హ‌డావుడీ అవ‌స‌రం లేదు. కానీ.. `సాహో` టీమ్ వేరేలా ఆలోచిస్తోంది. ‘బిగ్గ‌ర్ దెన్ బాహుబ‌లి’ అనే ఇమేజ్ ఈ సినిమాకి తీసుకొచ్చే ప‌నిలో త‌ల‌మున‌క‌లై ఉంది. అందుకే… బాలీవుడ్ క‌థానాయిక‌ని, అక్క‌డి న‌టీన‌టుల్ని, సాంకేతిక నిపుణుల్నీ వాడుకుంటూ ఈ సినిమాని బాలీవుడ్ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించ‌డానికి సిద్ధ‌మైంది. అక్క‌డితో ఆగిపోలేదు… సినిమా బ‌డ్జెట్ ఎంత‌న్న‌ది ముందే ప్ర‌క‌టించి మ‌రింత హైప్ క్రియేట్ చేసేలా చేసింది. అంతేనా?? కేవ‌లం యాక్ష‌న్ సన్నివేశాల‌కే రూ.90 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని ఘ‌నంగా చెప్పుకుంది. యాక్ష‌న్‌కే రూ.90 కోట్లంటే… మ‌రి సినిమాకి ఇంకెంత అయ్యుంటుంది..? రోబో 2.0 ని ప‌క్క‌న పెడితే.. సౌతిండియాలో ‘సాహో’నే ఖ‌రీదైన సినిమా అన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమా విడుద‌ల‌య్యే స‌రికి బ‌డ్జెట్ ఎంత‌కి తేలుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు.

బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ సినిమా అంటే… ఎంతైనా ప‌లుకుతుంది. కాబ‌ట్టి నిర్మాత‌లు ఖ‌ర్చు పెట్టడంలో ఎలాంటి త‌ప్పూ లేదు. కానీ సినిమా గురించి ఇంత హైప్ సృష్టించుకోవ‌డం ఎందుకు? అనేదే అర్థం కావ‌డం లేదు. బాహుబ‌లి రేట్ల‌కు ‘సాహో’ని ఎవ్వ‌రూ కొన‌రు. ఆ సంగ‌తి యూవీ క్రియేష‌న్స్‌కి కూడా తెలుసు. అలాంట‌ప్పుడు `బిగ్గ‌ర్ దెన్ బాహుబ‌లి` అనే ట్యాగ్‌లైన్ ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది? సినిమా చూసి `దీనికి ఎంత ఖ‌ర్చు పెట్టి ఉంటారో` అని ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోవాలి. అంతే గానీ..’ఈ ఫైట్‌కి ఇంత ఖ‌ర్చు పెట్టాం’ అని ముందే చెప్పేస్తే… ఫైట్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆ ఖ‌ర్చే క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికి ఈ సినిమాపై వ‌చ్చిన హైప్ చాలు. అది అలా పెరుగుతూ పోతే.. సినిమాకే న‌ష్టం. ‘మ‌గ‌ధీర‌’ త‌ర‌వాత రామ్‌చ‌ర‌ణ్ ఇమేజ్ కూడ ఇలానే క‌నిపించింది. అందులోంచి బ‌య‌ట ప‌డ‌డానికి చ‌ర‌ణ్‌కి చాలా ఏళ్లు ప‌ట్టింది. ‘సింహాద్రి’ త‌ర‌వాత‌… ఎన్టీఆర్ ప‌రిస్థితీ ఇంతే. రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో సూప‌ర్ హిట్లు కొట్టిన హీరోలు.. ఆ త‌ర‌వాత ఆ ఇమేజ్‌ని కాపాడుకోవ‌డానికీ, ఆ స్థాయి విజయాల్ని అందుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డ్డారు. ఈ విష‌యం ‘ఛ‌త్ర‌ప‌తి’ చేసిన ప్ర‌భాస్‌కీ తెలుసు. కానీ ఈ సూత్రాలు, పాఠాలూ ‘సాహో’ విష‌యంలో పాటించ‌డం లేదేమో అన్న అనుమానం క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close